క‌రోనా వైర‌స్ రోజురోజుకూ వ్యాప్తిస్తున్న నేప‌థ్యంలో చైనాలో ఆఫ్రిక‌న్లు తీవ్ర వివ‌క్ష‌కు గుర‌వుతున్నారు. అడుగ‌డుగునా తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. వారిప‌ట్ల చైనా పోలీసులు చాలా దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నిజానికి.. ఆఫ్రిక‌న్లు క‌నిపిస్తే చాలు ఎక్క‌డిక‌క్క‌డ బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకుని బ‌లవంతంగా క్వారంటైన్‌లోకి త‌ర‌లిస్తున్నారు. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. ఎలాంటి ట్రావెలింగ్ హిస్ట‌రీ లేకున్న‌ప్ప‌టికీ చైనా పోలీసు అధికారులు వారు చేయాల‌నుకున్న‌ది చేస్తున్నారు. అయితే.. పోలీసులు ఆఫ్ర‌క‌న్ల‌ను బ‌లంతంగా అదుపులోకి తీసుకుంటున్న వీడియోలో సోష‌ల్ మీడియాలు, దక్షిణ చైనా నగరమైన గ్వాంగ్‌జౌలో ఆఫ్రికన్ విద్యార్థులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు వైర‌ల్ అయ్యాయి. వాటిని చూసిన ఆఫ్రికా దేశాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోతున్నాయి.  చైనా దుశ్చ‌ర్య‌ల‌పై కెన్యా మీడియా మండిప‌డంది. 

 

ఈ క్ర‌మంలో శనివారం కెన్యాలోని ప్ర‌ముఖ వార్తాపత్రిక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. మొదటి పేజీలో *చైనా న‌ర‌కం నంఉచి కెన్యన్లు ర‌క్షించండి* అంటూ ప్ర‌చురించిన క‌థ‌నం ఆఫ్రికా దేశాల ఆగ్ర‌హానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. అంతేగాకుండా.. చైనీయులు వెంట‌నే కెన్యాను విడిచిపెట్టండి అంటూ ఆ దేశ పార్లమెంటు సభ్యుడు హెచ్చ‌రించారు. అలాగే.. చైనాపై ఉగాండా , దక్షిణాఫ్రికా, నైజీరియా మీడియా కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిజానికి.. చైనా తీరు వ‌ల్ల చైనాలో ఆఫ్రిక‌న్లు నిరాశ్ర‌యుల‌య్యారు. భూస్వాములు, హోట‌ళ్లు, అద్దె ఇళ్ల నుంచి వెల్ల‌గొడుతుండ‌డంతో ఆఫ్రిక‌న్లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అక్క‌డ రోడ్ల‌పై ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఈ క్ర‌మంలో పోలీసులు వ‌చ్చి వారితో దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ బ‌లవంతంగా క్వారంటైన్ల‌లో త‌ర‌లించి, ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అయితే.. చైనా ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌న్న దానిపై ఆస‌క్త‌కిర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

 

ఈ నేప‌థ్యంలో ఆఫ్రికాలో చైనా దౌత్య‌ప‌ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. నిజానికి.. ఆఫ్రికాలో చైనా దౌత్య‌ప‌ర‌మైన సంక్షోభాన్ని చ‌విచూడాల్సి వ‌స్తోంది. ఆఫ్రికా దేశాల‌తో ఉన్న సంబంధాలు దెబ్బ‌తినే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. నిజానికి.. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ పుట్టిన విష‌యం తెలిసిందే. దాదాపు రెండు నెల‌ల‌పాటు క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌తో వుహాన్ న‌గ‌రాన్ని క‌రోనా బారి నుంచి కాపాడుకోగ‌లిగింది చైనా. సుమారు 80వేలకుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, సుమారు మూడువేల మందికిపైగా మ‌ర‌ణించారు. ఎట్ట‌కేల‌కు వుహాన్‌న‌గ‌రంలో కేసుల సంఖ్య దాదాపుగా జీరోకు రావ‌డం, వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తేయ‌డం తెలిసిందే. అయితే.. కొద్దిరోజ‌లుగా మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో వైర‌స్ సెకండ్ వేవ్ ప్రారంభం అయింద‌నే భ‌యాందోళ‌న చైనాలో మొద‌లైంది. అయితే.. ఈ కేసుల‌న్నీ కూడా విదేశాల నుంచి వ‌చ్చిన‌వారివేన‌ని చైనా చెబుతోంది. ఈక్ర‌మంలోనే చైనాలో ఆఫ్రిక‌న్ల ప‌ట్ల చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ బ‌లవంతంగా క్వారంటైన్‌లోకి త‌ర‌లిస్తున్నారు చైనా పోలీసు అధికారులు. 

 

నిజానికి.. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆఫ్రికా దేశాల‌తో చైనా వాణిజ్య‌సంబంధాల‌ను కొనసాగిస్తోంది. 2019 లో 208 బిలియన్ డాలర్ల విలువైన ఆఫ్రికాతో చైనా వాణిజ్యం ఉందని చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో సంబంధాల‌ను కాపాడుకునేందుకు చైనా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ఇదే విష‌యం చెప్పారు. తాము ఎలాంటి వివ‌క్ష చూప‌డం లేద‌ని, అంద‌రూ స‌మాన‌మేన‌ని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా చైనాలో మ‌ళ్లీ క‌రోనా కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని, అందుకే అంద‌రికి ప‌రీక్ష‌లు చేయిస్తున్నామే త‌ప్ప ఎలాంటి వివ‌క్ష చూప‌డం లేద‌ని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: