క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే పరిపాలనలో ప్రతిపక్షాల అంచనాలకు అందకుండా జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నాడు. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే జగన్ దెబ్బేంటో ప్రతిపక్షాలకు బాగా తెలిసి వచ్చింది. దాంతో మామూలుగా అయితే జగన్ ను అడ్డుకోవటం అసాధ్యమని ప్రతిపక్షాలకు బాగా అర్ధమైపోయింది. అందుకనే జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా కోర్టుకెక్కుతున్నాయి ప్రతిపక్షాలు.

 

తాజాగా పేదలకు ఇళ్ళ స్ధాలల సేకరణ విషయంలో కూడా తాజాగా కోర్టులో కేసు దాఖలయ్యింది. ఇంతకీ పిటీషనర్ చెప్పిన అభ్యంతరం ఏమిటయ్యా అంటే అధికధర చెల్లించి ప్రభుత్వం భూమిని కొంటోందట. భూమి సొంతదారుడికి ప్రభుత్వం అధిక ధర చెల్లిస్తోందంటే సంతోషించాల్సిన విషయమే కదా ? ఇందులో బాధపడాల్సింది ఏముంది ?  రిజిస్ట్రేషన్ ధరకన్నా ప్రభుత్వం తక్కువ ఇస్తే పిటీషనర్ బాధపడాలి. భూ యజమానులను మోసం చేస్తోందంటూ కోర్టులో కేసు వేసినా అర్ధముంది ?

 

ఈ విషయమే కాదు ఇంగ్లీషుమీడియం ప్రవేశపెడదామని అనుకుంటే కోర్టుకెక్కారు. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులేయటం తప్పే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ రంగులేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్, టిడిపిలు అధికారంలో ఉన్నపుడు వాటి రంగులేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

అయితే వైసిపి అధికారంలోకి వచ్చి తమ పార్టీ రంగులేసుకునేటప్పటికి కోర్టులో కేసు వేయించాయి. కేవలం జగన్ మీద కోపంతోనే ఎవరినో పురమాయించి మరీ కోర్టులో కేసు వేయించాయి ప్రతిపక్షాలు. మూడు రాజధానుల ప్రతిపాదన, పిపిఏ సమీక్షలు, రివర్సు టెండరింగ్ ఇలా.. చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతీ నిర్ణయం మీద కోర్టులో కేసులున్నాయి. అంటే జగన్ నిర్ణయాలను అడ్డుకోవాలంటే కోర్టులో కేసు వేయటం ఒకటే మార్గంగా ప్రతిపక్షాలు డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది.

 

న్యాయవ్యవస్ధపై చంద్రబాబునాయుడుకున్న పట్టు విషయంలో  ఇప్పటికే అనేక ప్రచారాలున్నాయి. దానికి తగ్గట్లే జనాలకు మంచి చేసే నిర్ణయాలను తీసుకున్నా కూడా కోర్టులో జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతుండే సరికి కోర్టులపై చంద్రబాబుకు నిజంగానే పట్టుందనే విషయం నిర్ధారణైపోతోంది. ఏదేమైనా ప్రతిపక్షాల తీరు మాత్రం చాలా అభ్యంతరకరంగానే ఉంటోంది. ప్రతిపక్షాల ఆలోచన ఏమిటో అర్ధమైపోతోంది కాబట్టే జగన్ కూడా దానికి తగ్గట్లే నడుచుకోవాలంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: