ఇద్దరి మధ్య గొడవలు మొదలైపోతాయి కాబట్టి తాము హ్యాపీగా ఉండచ్చని అనుకున్న వాళ్ళకి తెలంగాణా సిఎం కేసీయార్ షాకిచ్చాడు.  పోలవరం ప్రాజెక్టు పనులపై గతంలో తెలంగాణా ప్రభుత్వం చేసిన అభ్యంతరాలను, కోర్టుల్లో వేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకుంటామని కేసీయార్ స్పష్టంగా చెప్పారు. దాంతో చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా షాక్ కొట్టిందనే  ప్రచారం సోషల్ మీడియాలో  మొదలైంది. పోలవరం కావచ్చు ఇతరత్రా ప్రాజెక్టల విషయంలో తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది కాబట్టి ఇక ప్రాజెక్టు పనులు ముందుకు సాగవని చాలామంది అనుకున్నారు. కేసీయార్ యాక్షన్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు, ఎల్లోమీడియా జగన్ పై ధ్వజమెత్తిన విషయం అందరికీ తెలిసిందే.

 

నిజానికి చంద్రబాబు గనుక పద్దతిగా ప్రాజెక్టు పనులను స్పీడు చేయించుంటే ఈ పాటికే పోలవరం నిర్మాణ పనులు దాదాపు అయిపోయుండేవే. కానీ ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో చంద్రబాబు హిడెన్ ప్లాన్ వేరే ఉందని అందరికీ అనుమానాలు పెరిగిపోయేట్లు వ్యవహరించాడు. అంచనా వ్యయాలను ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నట్లు అప్పట్లో వైసిపి నేతలు ఎన్ని ఆరోపణలు చేసింది అందరికీ తెలిసిందే. అందుకనే ప్రాజెక్టును పూర్తి చేయటం కన్నా దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నాడనే ఆరోపణలను చంద్రబాబు ఎదుర్కోవాల్సొచ్చింది. దానికి తగ్గట్లే మొన్నటి ఎన్నికల సమయంలో నరేంద్రమోడి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంలాగ వాడుకుంటున్నాడని చేసిన ఆరోపణలు కూడా బాగా డ్యామేజి చేసింది.

 

సరే ఎవరి ఆరోపణలు ఎలాగున్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్సు టెండర్ల పేరుతో మొత్తం కాంట్రాక్టర్లనే మార్చేశాడు. దాంతో పనుల్లో ఊపందుకుంది. అయితే హఠాత్తుగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఆ సమస్య తగ్గి మళ్ళీ పనులు మొదలవుతున్న సమయంలో  కరోనా వైరస్ సమస్య వచ్చిపడింది. దీనివల్ల మరో మూడు నెలలు పనులు నిలిచిపోయాయి. సరే ఇపుడిప్పుడే ప్రాజెక్టు పనులు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. అయితే పనులను ఎంత స్పీడు పెంచినా కోర్టులో కేసులైతే వెంటాడుతునే ఉన్నాయి. ప్రాజెక్టు పనుల విషయంలో ఎదురవుతున్న సమస్యలతో జగన్ వ్యతిరేకులంతా పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారనే అనుకోవాలి.

 

ఇటువంటి సమయంలోనే కేసీయార్ పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ పోలవరంపై తెలంగాణా ప్రభుత్వం కోర్టులో  వేసిన కేసులను ఉపసంహిరించుకుంటున్నట్లు ప్రకటించాడు. కేసీయార్ ప్రకటన జగన్ వ్యతిరేకుల్లో  చాలామందికి షాక్ కొట్టిందనే చెప్పాలి.  కోర్టు కేసుల విషయంలో కేసీయార్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఏదేమైనా తెలంగాణా ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వాపసు తీసుకోవటం అన్నది ఏపికి చాలా మేలు చేస్తుందనే చెప్పాలి. ఏపికి మేలు చేసే పనేదైనా జగన్ కూడా సానుకూలమే అవుతుంది కదా.  ఈ విషయమే జగన్ వ్యతిరేకులకు మింగుడుపడటం లేదు. చూద్దాం ఇంకా ఎన్ని షాకులు తినాలో జగన్ వ్యతిరేకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: