అబ్బో అబ్బో ఇది ఆషామాషీ బండి కాదండోయ్ ! ఎక్కడో పాతాళంలో ఉన్న పార్టీని అమాంతం స్పీడ్ పెంచి మరీ దూసుకు వెళ్లే విధంగా చేయడం లో   సక్సెస్ అయిన బండి. ఈ బండి రాజకీయాలకు అంతే లేదండొయ్ . ఒక్కో సందర్భంలో బండి స్పీడు ఓవర్ అయ్యి అదుపు తప్పినట్టుగా కనిపిస్తున్నా, పార్టీని హై స్పీడ్ తో పైకి తీసుకు వెళ్ళే క్రమంలో ఆ బండికి ఈ మాత్రం స్పీడు ఉండాలని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. లేకపోతే కారును ఓవర్టేక్ చేయడం కష్టమనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన హడావుడి మామూలుగా ఉండడం లేదు. అసలు పార్టీని అధికారం వైపు నడిపించేందుకు అవసరమైన మొత్తం ఉత్సాహం ఎలా తీసుకు రావాలి అనేది బండికి బాగా తెలుసు. 


అసలే దుబ్బాక లో ఈ బండి ప్రభావం ఏమీ ఉండదు తుస్ మంటుంది అని అంతా అభిప్రాయపడినా, కారును దాటుకుని విజయాన్ని బీజేపీకి తీసుకురావడంలో బండి కష్టం వృధా కాలేదు. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కూడా బండి కారును ఢీకొట్టి పై చేయి సాధించే విధంగా  సృష్టించేలా మాటలు ఎన్నో మాట్లాడుతూ హడావుడి చేస్తోంది. పాకిస్థానీయులు,  రోహింగ్యాలు అంటూ కారు పార్టీ ని కంగారు పెట్టే విధంగా బండి మాట్లాడుతున్న మాటలు పార్టీలో కంగారు పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు మిత్రుడు, ప్రస్తుత ఎన్నికల్లో శత్రువైన ఎంఐఎం పార్టీని సైతం ఇరుకున పెట్టే విధంగా బండి తన మాటల తూటాలను వదులుతున్నారు. ఇవన్నీ కారు పార్టీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. ఒకటా,  రెండా అసలు ఎన్నో ఎన్నెన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఈ బండి మారుతోంది. రాబోయే ఎన్నికల్లోనూ తెలంగాణ లో కాషాయ జెండా మాత్రమే ఎగురుతుంది అంటూ బండి హడావుడి చేస్తున్నారు. ఈ బండి మామూలు బండి కాదండోయ్ అంటూ, తెలంగాణా అంతటా చెప్పుకునేలా చేసేస్తున్నాడు. ఇంతకీ ఈ బండి రాజకీయం కారు ను ఓవర్ టేక్ చేస్తుందా ..? చతికల పడేలా చేస్తుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: