క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారమైతే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. యావత్ ప్రపంచం కరోనా వైరస్ విరుగుడు టీకా ఎప్పుడెప్పుడు తయారవుతుందా అని ఎదురు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ తయారుచేసిన టీకా విడుదలైంది. అలాగే మనదేశానికి వస్తే పూనాలోని సీరమ్ ఫార్మా, హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ కూడా మరి కొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి విడుదలవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 25వ తేదీనుండి టీకా అందుబాటులోకి రాబోతున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచదేశాలన్నీ కోవిడ్ టీకాపైనే దృష్టి పెట్టాయి. ఫైజర్ అయినా భారత్ బయోటెక్, సీరమ్ ఫార్మా కంపెనీ అయినా సకల మానవాళికి తక్కువ ధరలోనే టీకాను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నేపద్యంలోనే ధనిక దేశాల నుండి హఠాత్తుగా అడ్డంకులు మొదలైనట్లు ‘పీపుల్స్ వ్యాక్సిన్ కూటమి’ అనే స్వచ్చంద సంస్ధ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆందోళన ఎందుకంటే టీకాను కొనుగోలు చేయటానికి ధనిక దేశాలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయట. తమ అవసరాలకు మించి టీకా వ్యాక్సిన్ కొనుగోలుకు ఇప్పటికే వేల కోట్ల డాలర్లను ధనిక దేశాలు రెడీ చేసుకున్నాయని ఈ సంస్ధ ఆరోపిస్తోంది. పై మూడు సంస్ధలతో వ్యాక్సిన్ సరఫరాకు ధనిక దేశాలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకుని డబ్బులు కూడా చెల్లించేశాయని కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి కరోనా వైరస్ కారణంగా ధనికులు, పేదలన్న తేడా లేకుండా కొన్ని లక్షలమంది చనిపోయారు. అందుకనే బాధితుల స్టేటస్ తో సంబంధం లేకుండా టీకాను వేయించుకోవాలని ఆతృతపడుతున్నారు.
ఇటువంటి నేపధ్యంలోనే ధనికదేశాలు తమ అవసరాలకు మించి టీకాను కొనుగోలు చేయబోతున్నట్లు కూటమి చెబుతోంది. కూటమి సర్వే ప్రకారం 14 శాతం ధనిక దేశాల జనాభా దగ్గరే 53 శాతం కరోనా వ్యాక్సిన్ ఉందట. చేసుకున్న ఒప్పందం కారణంగా తయారు చేసే వ్యాక్సిన్ సరఫరాలో కంపెనీలు ముందు ధనిక దేశాలకే అందించాలట. దీని వల్ల అభివృద్ధి చెందుతున్న, పేదదేశాల్లోని దాదాపు 70 శాతం జనాభా చాలా ఇబ్బందులు పడాల్సుంటుందని కూటమి హెచ్చరిస్తోంది. బ్రిటన్ లో వ్యాక్సిన్ వాడకం మొదలవ్వగానే కెనాడా ప్రభుత్వం బారీ ఎత్తున ఆర్డర్లిచ్చేసిందట. తమ దేశాల జనాభాకు అవసరమైన వ్యాక్సిన్ కు ఐదురెట్లు రెడీ చేసేసుకున్నట్లు కూటమి ఆరోపించింది. కెనడా బాటలోనే మిగిలిన ధనికదేశాలు కూడా నడిస్తే ఇక మిగిలిన ప్రంపంచం మాటేమిటంటూ కూటమి అడిగిన ప్రశ్నకు సమాధానాలు దొరకటం లేదు. చూద్దాం చివరకు ఏమవుతుందో
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి