వినటానికే ఆశ్చర్యంగా ఉంది. కానీ తెలుగుదేశంపార్టీ నేతలు బహిరంగంగా చెప్పిన తర్వాత ఇక నమ్మకుండా ఉండటం ఎట్లా ? అయితే చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరు ? దేనికోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న విషయంలో సరైన క్లారిటి రావాల్సుంది. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ పార్టీలో ఎంపి కేశినేని నాని, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి నాగూల్ మీరా కీలక నేతలు. వీళ్ళల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోండా ఉమ ఓడిపోయారు. విజయవాడ ఎంపిగా పోటీ చేసిన కేశినేని నాని గెలిచారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండే వీళ్ళిద్దరికీ పడదు. బోండాను వెనుక నుండి ఇంకా సీనియర్ నేతలు ఎంపికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం కూడా బాగుంది.




ఇలాంటి పరిస్దితుల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో వీళ్ళ మధ్య విభేదాలు ఒక్కసారిగా రోడ్డుమీద పడ్డాయి. గడచిన ఏడాదిన్నరగా ఎంపి ఒకవైపు మిగిలిన ముగ్గురు నేతలు మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి విషయంలోను పై రెండు వర్గాలకు ఉప్పు-నిప్పుగా తయారైంది వ్యవహారం. ఎంపికి వ్యతిరేకంగా పై ముగ్గురు రెండు రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టి అమ్మనాబూతులు తిట్టారు ఎంపిని. చివరకు ఎంపిని చెప్పుతో కొట్టుండేవాడిని అని బుద్ధా అని హెచ్చరించేదాకా వెళ్ళింది వ్యవహారం. ఈ సందర్భంగానే చంద్రబాబును ఎంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.




అయితే ఇంచుమించు ఇలాంటి ఆరోపణలే ఎంపి కూడా చేస్తున్నారు. అంటే జనాలకు ఇక్కడ అర్ధమైంది ఏమిటంటే రెండు గ్రూపులు కూడా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని.  చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి వియవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్ధిగా తన కూతురు శ్వేతను ఎంపి ప్రకటింపచేసుకున్నారని బోండా అండ్ కో ఆరోపణలు. సరే ఇది నిజమే అనుకుందాం కాసేపు. ఎంపి ఆరోపణల ప్రకారం మరి వీళ్ళ ముగ్గురు చంద్రబాబును ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ? ఎందుకంటే పార్టీలో తనను ఒంటరిని చేసేందుకేనట. తనను పార్టీ నుండి బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఎంపి మండిపడుతున్నారు. అవసరమైతే తాను ఎంపి పదవికి రాజీనామా చేస్తాను కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని చెప్పారు. మరి ఈ ‘బ్లాక్ మెయిల్ రాజకీయాలు’ ఎంతకాలం కంటిన్యు అవుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: