సారీ సారీ సారీ : నైబ‌ర్ హుడ్ పీఎం

త‌ప్పులు దిద్దుకోవడంలో ఎవ్వ‌ర‌యినా ముందుండాల్సిందే.. నేను త‌ప్పు చేశాను మీడియా ఎదుట మైక్ ముందు అలా మాట్లాడ‌కూడ‌దు..అని నాయ‌కులు ఒప్పుకోవ‌డం అరుదు.. ఆ మాట‌కు వ‌స్తే ఇమ్ర‌న్ త‌న త‌ప్పు పై చింత ప‌డ్డాడు. అలానే ట్రంప్ కూడా ఇదే రీతిన గ‌తంలో ఉన్నాడు.. ఇవ‌న్నీ అమ్మాయిల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌కు వారు ఇచ్చిన ప్ర‌తిస్పంద‌న‌లే కావ‌డం గ‌మనార్హం. నిత్యం స‌మ‌స్య‌ల‌తో సత‌మతం అయ్యే దేశానికి దిశా నిర్దేశం ఎంత కీల‌క‌మో ఆ దేశ అధ్య‌క్షుడి మాట కూడా అంతే కీల‌కం.. డియార్ స‌ర్ మాట జారొద్దు..


రెండంటే రెండు  విష‌యాల్లో పాక్  వెనుక‌బ‌డిపోతోంది.. ఆ వెనుక‌బాటు దిద్దుకోక‌పోగా ప్ర‌పంచంలోనే న‌వ్వుల పాల‌వుతోంది. ఒక‌టి అత్యాచార ఘ‌ట‌న నియంత్ర‌ణ అయితే, రెండు జెండ‌ర్ ఈక్వాలిటీ.. ఈ రెంటలో వెనుబాటుకు దిద్దుకోలేని త‌ప్పులకూ ప్ర‌ధాని ఇమ్రాన్ బాధ్య‌త వ‌హించాల్సిందే. కానీ ఆయ‌న కొన్ని బాధ్య‌తారాహిత్య వ్యాఖ్య‌లు చేశారు. అంత‌ర్జాతీయ స‌మాజం ఎదుట సిగ్గుతో త‌ల వొంచుకుని చేసిన త‌ప్పిదం ఇది అని అంగీక‌రించి, స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. ఇక‌పై అలాంటి వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌బోన‌ని ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించి త‌నలో నిజాయితీని చాటుకున్నారు.



వ్యాఖ్య‌లు వివాదాల‌కు కార‌ణం అవుతాయి.. వివాదాలు విస్ఫోట‌నాలు సృష్టిస్తాయి. అలాంటి వేళ త‌గ్గితే మేలు..త‌గ్గ‌కుంటే కీడు..అది తెల్సుకునే ఏమో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ త‌గ్గారు.. త‌న త‌ప్పు తెల్సుకున్నారు. మ‌హిళ‌లకు సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు వెన‌క్కు తీసుకుని సారీ చెప్పారు. అత్యాచార ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి బాధ్య‌త అమ్మాయిల‌దే అన్న అర్థం ధ్వ‌నించేలా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌నం దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు కార‌ణం అయింది. ఇక‌పై బుద్ధి త‌క్కువ వ్యాఖ్య‌లు చేయ‌న‌ని చెప్పారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయ మీడియా ఎదుట ఇమ్రాన్ చేసిన దిద్దుబాటు వ్యాఖ్య‌లు ఆయ‌న‌లో ప‌రిప‌క్వ‌త‌కు
 నిద‌ర్శ‌నం  కావ‌డం శుభ‌ప‌రిణామం.  

మరింత సమాచారం తెలుసుకోండి: