ఎ బైట్ ఎబౌట్ సింధు : అన‌గ‌న‌గా ఆదివారం..

ఓడిపోవ‌డంలో ఏమ‌యినా ఆనందం ఉందా స‌ర్..పాపం మ‌నుషుల‌కు ఇదొక్క‌టే అర్థం కాదు..ఈ సంగ‌తి పీవీ సింధూకు కూడా అ ర్థం కాలేదు..ఆ రాత్రి త‌న గురువు చెప్పిన మాటే ఆమెకు వేదం అయింది..క‌న్నీళ్లు ఆగిపోయాయి. ముందు మ్యాచ్ పోయిన బాధ కూడా పోయింది..ఇలాంటి గురువు ఎక్క‌డ స‌ర్ ఉంటారు. పార్క్ తే సంగ్ ది మ‌న దేశం కాద్సార్ .. కొరియా దేశ‌స్తుడు.. కానీ ఆయ‌న ఈ దేశాన్నీ,ఈ దేశ‌పు క్రీడాకారిణినీ ప్రేమించారు.. ఇప్పుడు అనండి సింధూ గ్రేట్.. పార్క్ గ్రేట్ అని!


ఆ ఆదివారం నా జీవితాన్ని మార్చేసింది. ఆ ఆదివారం నా క‌ల‌కు అర్థం దొరికింది అంటూ త‌న పోరు గురించి చెప్పారు పీవీ సింధు ..సెమీస్ లో పోతే అంతా పోయింద‌ని, కాద‌ని ప‌తకం ఏద‌యినా ప‌త‌క‌మేన‌ని భార‌త‌ దేశం గ‌ర్వించే స్థాయి నీద‌ని ప‌దే ప‌దే చెప్పా రు.. ఎవ‌ర్రా ఈ గురువు అనుకుంటున్నారా మీరు.హా! గొప్ప వాడు.. క‌రోనా స‌మ‌యంలో అస‌లు ప్రాక్టీసుకు ఎన్ని భ‌యాలో వాట న్నిం టినీ వ‌ద్ద‌ని, తన దేశానికి పోకుండా ఈ దేశంలో ఉంటూ ప్ర‌తిరోజూ గ‌చ్చిబౌలీ స్టేడియంలో ప్రాక్టీసు చేయించిన వాడు. అవును! ఇలాంటి కోచ్ లు ఉంటే చాలు మ‌న బంగారాలు మ‌రింత రాణిస్తారు.


మీరు పారిస్ ఒలంపిక్స్ లో స్వ‌ర్ణం తెస్తారా అంటారేంటి? ఇలాంటి దిక్కుమాలిన ప్ర‌శ్న‌ల‌తో ఆమెను విసిగిస్తారా..ఆమెకు ఈ విజ యాల‌ను ఆస్వాదించే స‌మ‌యం ఇవ్వండి..త‌రువాత  ప్ర‌శ్న‌లు.. నేను ఈ విజ‌య గ‌ర్వంతో ఉన్నాను. ఇంకాస్త స‌మ‌యం కావాలి మీకు ఏం చెప్పాల‌న్నా అని అంటున్నారు సింధు. మీరు కూడా ఓడిపోండి ఏం కాదు.. మీ బిడ్డ‌లకూ ఇదే చెప్పండి.. క‌రోనా లో టో ర్నీలు లేవు.ఆట‌లు లేవు. ఏమీ లేవు.అలాంటి స‌మ‌యంలో పీవీ సింధూ త‌న దైన సాధ‌న చేశారు. అవును! మంచి గురువు కా ర‌ణంగా వ‌చ్చిన ఫ‌లితాలు ఇవి.. ఆ గురువుకు వంద‌నాలు చెల్లించండి. ఆమెకు మ‌ద్దతుగా నిలవండి. చెప్పానుగా గోల్డ్ ఏంటి ? ఆ మెనే గోల్డ్.. కొత్త‌గా వ‌చ్చేవి ఏవీ ఉండ‌వు. మీ క‌ల‌ల‌కు కొందరు ప్ర‌తినిధులు ఉంటారు వారిని మాత్రం వెత‌కండి. వాళ్లే మీకు క‌డ దాకా తోడుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: