అయితే ప్రశ్నించాల్సిన విషయం మాత్రం ఆ పథకాల గురించి కాదు.. ఆ పథకాలకు పెడుతున్న పేర్ల గురించి. జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మాట వాస్తవమే. అయితే.. అందుకు జగన్ ప్రభుత్వం సొమ్మునే ఖర్చు చేస్తున్నారు తప్ప.. తన సొంత ఖాతాల నుంచి కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ.. ఆయన ప్రతి పథకానికీ తన పేరు కానీ.. తన తండ్రి పేరు కానీ పెట్టుకుంటున్నారు.
ఏవో ఒకటి, రెండు పథకాలకు ఇలా ప్రజానాయకుల పేర్లు పెట్టడం గతంలోనూ ఉన్నదే. కానీ.. ఏకంగా ప్రతి పథకానికీ సొంత పేర్లు పెట్టుకోవడం మాత్రం ఆహ్వానించతగిన పరిణామం కాదు. దీనికి తోడు జగన్ ఇప్పడు తన తండ్రి పేరో.. మరొకరి పేరో పెట్టడం లేదు. నేరుగా ఇప్పుడు స్వయంగా చాలా పథకాలకు తన పేరు పెట్టేసుకుంటున్నారు. జగనన్న విద్యాకానుక, జగనన్న చేదోడు, జగనన్న అమ్మఒడి.. ఇలా ప్రతి పథకానికి సీఎం తన సొంత పేరు పెట్టుకుంటున్నారు.
ఇలాంటి పథకాలకు జగన్ పేరు కాకుండా సీఎం పేరుతో పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇది ఒక కోణం.. ఇది కొంత వరకూ సహించగలం.. కానీ ఇప్పుడు జగన్ చేస్తున్న ఇంకో పని మరీ అరాచకంగా ఉంది. అదేంటంటే.. ఎప్పుడో టీడీపీ హయాంలో పెట్టిన పేర్లను కూడా మార్చేస్తున్నారు. ఇటీవల గురుకులాలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన బాలయోగి పేరు తొలగించారు. ఇప్పుడు వాటికి కొత్తగా అంబేడ్కర్ పేరు పెట్టారు. కానీ.. ఎప్పటి నుంచో ఉన్నవి తొలగించడం ఎందుకు.. అంబేడ్కర్ పేరుతో ఇప్పటికే ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా. టీడీపీ నేత కాబట్టి బాలయోగి పేరు తొలగించాలన్న యావ తప్ప.. మరో కారణం కనిపించడం లేదు. జగన్ దిసీజ్ టూమచ్ అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి