రాజకీయ అవసరాలకు, కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోవడంపై ప్రభుత్వం చూపించే శ్రద్ధ.. వారి ఇబ్బందులు తీర్చడంలోచూపట్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌  విమర్శించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చామంటూ సీఎం ప్రసంగాల్లో చెప్తున్న మాటలు... వాస్తవంలో అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు. పోలీసులకు అందాల్సిన ప్రయాణ భత్యాన్ని 14 నెలల నుంచి బకాయిపెట్టారన్నారు. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు సిబ్బంది.. నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలతో ఆందోళన చెందుతున్నారన్నారు.


దిగువ స్థాయి సిబ్బందికి భద్రత రుణాలు, సరెండర్ మొత్తాలు ఇవ్వడానికి ఎందుకు ఆటంకాలు ఎందుకు సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. సమస్యల గురించి అడిగిన చిరుద్యోగులను వేధించడం మానుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసు నిందితుల్లో ఇప్పటికీ ఒకరిని కూడా అరెస్టు చేయలేకపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు.


తమ జీతం నుంచి భద్రత పేరుతో కొంత మొత్తాన్ని మినహాయించుకొంటున్నారని, ఆ మొత్తాన్ని ఇంటి నిర్మాణ సమయంలోనో, మరో అత్యవసర సందర్భంలోనో రుణంగా తీసుకోవచ్చని... ఇందుకోసం దరఖాస్తు చేస్తే పెండింగ్లో ఉంచడమో, తిరస్కరించడమో చేస్తున్నారని సిబ్బంది ఆవేదన చెందుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. దిగువ స్థాయి సిబ్బందికి భద్రత రుణాలు, సరెండర్ మొత్తాలు ఇవ్వడానికి వస్తున్న ఆటంకాలు ఎందుకు సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.


అసలు పోలీసు భద్రత కోసం జీతాల నుంచి మినహాయించిన మొత్తాలు భద్రంగా ఉన్నాయా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జమ చేసుకున్న ఆ మొత్తాన్ని ఏమి చేశారో పాలకులు వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్‌ చేశారు. తమ సమస్యల గురించి అడిగిన చిరుద్యోగులను వేధించడం మానుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. నంద్యాలలో కానిస్టేబుల్‌ సురేంద్ర హత్య కేసు నిందితుల్లో ఇప్పటికీ ఒకరిని కూడా అరెస్టు చేయలేకపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉన్నతాధికారులు సైతం సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన టిఏలు, సరెండర్ మొత్తాలు సకాలంలో అందేలా చూడాలని పవన్ కల్యాణ్ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: