రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఏం ప్రమాదం జరిగినా.. అది అన్యాయంగా లేదా అక్రమంగా జరిగి ఉన్నా దానిపై తీవ్ర స్థాయిలో తన ఆవేశంతో చెలరేగిపోతుంటారు పవన్ కళ్యాణ్. మొన్న ఇప్పటంలో జరిగిన సంఘటనకు ఆయన స్పందించిన తీరే దీనికి ఉదాహరణ. ఇప్పటంలో ఆక్రమంగా కట్టిన గోడలను ముందుగా నోటీసులు ఇచ్చి మరీ చర్యలు తీసుకుని వాటిని కూల్చి వేసినా పవన్ కళ్యాణ్ తన సొంత విమానంలో అక్కడకు చేరుకొని మరి దాని పై తీవ్ర స్థాయిలో పోరాడారు.


వైయస్సార్సీపి  ప్రభుత్వం ప్రజలపై దాడి చేసింది అని చెలరేగిపోయారు. పైగా అక్కడ వారికి లక్ష రూపాయలు విరాళాలను కూడా అందించారు ఆయన. కానీ మొన్న కందుకూరులో జరిగిన సమావేశంలో చనిపోయిన ఎనిమిది మంది గురించి ఇంకా గుంటూరులో చనిపోయిన ముగ్గురి గురించి కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. దుర్ఘటనకు అసలు కారణమైన వ్యక్తుల గురించి మాట్లాడడం మానేసి  ఆ సంఘటనపై నిరసన వ్యక్తం చేయడం ఏంటి పవన్ కళ్యాణ్ అని వైయస్సార్సీపీకి చెందిన వ్యక్తులు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.


ఇప్పటంలో వైఎస్ఆర్సిపి పార్టీ ని తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ కు,  ఈ రెండు ప్రాంతాల్లో దుర్ఘటన జరగడానికి కారణం అయిన చంద్రబాబు నాయుడు కనబడడం లేదా.. మరి టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ ఆవేశం ఎక్కడకు పోయిందంటూ విమర్శిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను వదిలేసి మేము టిడిపిని ఎలా విమర్శిస్తామని జనసేన పార్టీ తరఫున ఎదురు వాదిస్తున్నారు. ఇలా ఇప్పుడు వైసీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.


ఈ రెండు వాదనల్లో వైసీపీ వాదనలోనే బలం కనిపిస్తోంది. అన్ని విషయాలపైనా స్పందించే పవన్  కల్యాణ్‌.. ఇలాంటి సీరియస్ విషయంలో ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలకు జనసేన ఇస్తున్న సమాధానాల్లో అంతగా పస కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: