
ఇప్పటివరకు జర్మనీ ఆర్థిక వ్యవస్థకు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారా సహకారాన్ని అందించిన రష్యా ఇప్పుడు దానిపై విరక్తిని పెంచుకుంది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జర్మనీపై విరుచుకుపడ్డారు. రష్యా ఇప్పటికీ అమెరికన్లచే ఆక్రమించబడిందని ఇంకా 2వ ప్రపంచ యుద్ధం లో లొంగిపోయిన రష్యా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా స్వతంత్రంగా వ్యవహరించలేకపోతుందని పుతిన్ చెప్పారు.
రష్యన్ టెలివిజన్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ పేలుళ్ల ప్రశ్నలకు ప్రతిస్పందనగా రష్యా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీతో సహా పాశ్చాత్య దేశాలన్నీ గత సంవత్సరం రష్యా గ్యాస్ పైప్లైన్ల పేలుళ్లపై స్పందించడం జాగ్రత్తగా మానుకున్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా జర్మనీ నార్డ్ స్ట్రీమ్ పేలుళ్లు ఉద్దేశపూర్వక చర్యలు అంటూ చెప్పుకొస్తుంది.
అయితే ఆ దాడులకు ఎవరు బాధ్యులని వారు విశ్వసిస్తున్నారో చెప్పడానికి మాత్రం నిరాకరించారు, నార్డ్ స్ట్రీమ్‌పై కూడా ప్రభావం చూపిన దాడులు, జర్మనీపై పుతిన్ భయంకరమైన దాడులకు మాత్రం బాధ్యత వహించలేదు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు జర్మనీ ట్యాంక్ 8 యుద్ధ పరికరాన్ని ఇవ్వడం ఒక కృతజ్ఞత లేని చర్యగా చూస్తున్నాడు. మరొక పక్కన కృతజ్ఞతలు చూపించాల్సిన చోట కృతజ్ఞతలు చూపించింది జర్మనీ. మొన్నటి వరకు ఆయిల్ విషయంలో రష్యా మీది పడి బతికిన జర్మనీ తాజాగా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్న పరిస్థితి.