గత ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీసింది ఎవరో కాదు. కేవలం సొంత మీడియానే అని అందరూ చెబుతుంటారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో భారీ ఓటమికి కారణం అనుకూల మీడియా అని తెలిసిందే.  లేని విజయాలను రాస్తూ, సర్వేల్లో ఆదరణ లేకున్నా గెలుస్తారని చెప్పుకుంటూ చంద్రబాబును ఆకాశానికెత్తేసారు. కానీ చివరకు 23 స్థానాలకు పరిమితమై బొక్కా బొర్లా పడ్డారు. దీని ద్వారా టీడీపీ చంద్రబాబు నేర్చుకోవాల్సిన విషయం అనుకూల మీడియా ఎన్ని కథనాలు చెప్పినా ప్రజల్లో నుంచి వచ్చిన తీర్పు మాత్రమే నిజమైందని తెలుసుకోవాలి.


ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోతూ కథనాలను ప్రసారం చేసేస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగినట్లు టీడీపీ అనుకూల ఛానల్ ప్రచారం చేసింది.  తెలంగాణ ఎంపీలతో వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ.. మళ్లీ జగన్ అధికారంలోకి రావడం కష్టమన్నట్లు తెలిపింది.


చంద్రబాబు వ్యుహం ముందు జగన్ తేలిపోతున్నాడని వైసీపీ ఎంపీ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ నేత జగన్ ఎవరేమీ చెప్పినా వినే పరిస్థితిలో లేడని తెలుస్తోందన్నారు. మరో సీనియర్ నేత మాట్లాడుతూ.. పైకి అంతా బాగున్నా తేడా కొట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది అన్నట్లు ప్రచారం చేసేస్తున్నారు.


పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఉప ఎన్నికలు అన్ని చోట్ల వైసీపీ గెలిచింది.  ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోగానే పూర్తిగా వైసీపీ పని అయిపోనట్లుగా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసేస్తోంది. చంద్రబాబుకు సొంతంగా గెలిచే అవకాశం ఇప్పటికీ లేనట్లుగానే కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని గెలిచారు. పొత్తు లేకుండా ఒంటరిగా గెలుస్తాననే నమ్మకం ఇంకా చంద్రబాబులో కనిపించడం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కచ్చితంగా వైసీపీ బలం తగ్గొచ్చు.. కానీ పూర్తిగా అధికారంలో నుంచి దూరం వెళ్లేంత కాదని కొంతమంది మేధావులు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ పరుగెడుతుందా.. ఫ్యాన్‌ అదరగొడుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: