వర్క్ ఫ్రం పని అయిపోయినట్లే తెలుస్తోంది. కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేయమని కార్పొరేట్ సంస్థలు చెప్పాయి. అయితే ఇంటి నుంచి పని చేయడం వల్ల కార్పొరేట్ కంపెనీలకు పని ఎక్కువగా జరిగింది. లాభం కూడా ఎక్కువగానే వచ్చింది. అయితే కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం తక్కువ ధరలకు స్థలాలు ఇస్తుంటుంది. ఇక్కడ పని చేసే సాప్ట్ వేర్ ఉద్యోగుల మీద ఆధారపడి ఎన్నో రంగాలు ఉపాధి పొందుతాయని ఆయా సాప్ట్ వేర్ కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ ఉంటుంది.  రెస్టారెంట్ షాపులు, బ్రాండెడ్ కార్లు, హెటళ్లు, హాస్టళ్లు, షోరూంలు, బైక్ ల షాపులు, కార్ల షాపులు, బార్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి వీరి ద్వారా ఉపాధి లభిస్తుంది.


అయితే సాప్ట్ వేర్ లో దాదాపు 50 వేల మందికి ఉద్యోగం దొరికితే దాదాపు వారిపై ఆధార పడి బతికే వాళ్లు 10 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. కాబట్టి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఆయా కంపెనీలకు రావాల్సిన రాయితీలను ప్రభుత్వం ఇవ్వడం లేదు. 2022 ఆగస్టు, సెప్టెంబర్ నుంచి రిమోట్ వర్కింగ్ సేవలు ఎక్కువయ్యాయి.


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 42.2 శాతం, ప్రొపెషనల్ అండ్ బిజినెస్ సెక్టార్ లో 20 శాతం, ఎడ్యుకేషన్ సర్వీసు లో 19 శాతం, హోల్ సేల్  ట్రేడ్ లో 17.2 శాతం,ఫైనాన్షియల్ రంగంలో 11. 2 శాతం, యూటిలిటీస్ రంగంలో 8 శాతం, పరిపాలనేతర రంగంలో 6.7 శాతం, తయారీ రంగంలో 5.8 శాతం,  ఎంటర్ టైన్ మెంట్ 9 శాతం, ఇలా వివిధ రంగాలకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగులు తిరిగి ఆయా కంపెనీల ఆఫీసులకు తిరిగి రావాల్సిన సమయం వచ్చింది. ఇంటికి అలవాటు పడిన వారు మళ్లీ ఆఫీసులకు వచ్చి పని చేయాల్సిన టైం వచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: