వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి నాలుగేళ్లుగా అవస్థలు పడుతున్నామంటూ వారు తమ ఆవేదనను వెళ్ళబుచ్చారట. మా ఓట్లతో నెగ్గి మీరు అన్నీ అనుభవిస్తున్నారని, మేము మాత్రం ఇలా అవస్థలు పడుతున్నామని వాళ్లు దాంట్లో చెప్పుకొచ్చారు. మళ్లీ ఎలక్షన్లు దగ్గర పడటంతో మేము గుర్తుకు వచ్చామా మీకు అంటూ వ్రాసుకు వచ్చారు ఆ ఫ్లెక్సీలో. శుక్రవారం సాయంత్రం గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆ ఫ్లెక్సీని చూస్తూ గ్రామంలోకి వెళ్లారు.
ఆ తర్వాత పోలీసులు ఫ్లెక్సీని తీసివేస్తుంటే అక్కడ ఉన్న వారు వీడియో తీయడం చూసి పోలీసులు ఆ ఫోన్ లాక్కొని వీడియో తొలగించారు. అయితే ఈ ఫ్లెక్సీని పెట్టింది ప్రజలు కాదని, టిడిపినో, జనసేనో పెట్టుంటాయని కొంత మంది అంటున్నారు. అసలే వైసిపి కార్యకర్తలు ఇంకా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కానీ ఇదంతా ప్రత్యేకించి మీడియా చేస్తున్న పని అని, వారు చెప్పేంత తిరుగుబాటు వైఎస్ఆర్సిపి పై ప్రజల్లో లేదని అంటున్నారు కొంత మంది వైసీపీ శ్రేణులు.
నిజానికి ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కొంతమంది విమర్శించడం సహజమని, ప్రశ్నించడం కూడా సహజమని వాళ్లు అంటున్నారు. అంతే గాని ప్రజలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు అని చూపించడం మాత్రం సమంజసం కాదని వాళ్ళు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి