వైఎస్సార్ కాపు నేస్తం కింద 536 కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ చేశారు. ఏడాదికి రూ.15 వేల చొప్పున ఏడాదికి మొత్తం రూ. 75 వేల చొప్పున 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య నున్న కాపు మహిళకు ఇస్తున్నారు. అయితే కాపులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అంటే దీనిపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పవన్ కల్యాణ్ ఒక వైపు.. టీడీపీతో కలిసి ప్రచారం చేస్తున్నారు. మరో వైపు కాపులకు అవకాశం ఇవ్వండి ఇకనైనా కాపులను గెలిపించుకుందాం అని అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించి విజయం సాధిస్తారా లేదా అనేది చూడాలి. తమ కుల వ్యక్తి వస్తే ఓకే అంటారా.. లేకపోతే జగన్ కు కాపు మహిళలు మద్దతిస్తారా లేదా అనేది చూడాలి.  కాపు మహిళలకు ఇస్తున్న ఈ కాపు నేస్తం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఏ విధంగా ఓట్లు పడతానేది ఆసక్తి కరంగా మారింది


దాదాపు 3 లక్షలకు పైనే ఉన్న కాపు మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. డబ్బులు డబ్బులే ఓట్లు ఓట్లే అనుకుంటే మాత్రం వైసీపీ కి ఓట్లు పడకపోవచ్చు. కానీ పవన్ ను కాదని జగన్ ను గెలిపిస్తారని కొంతమంది అనుకుంటున్నారు. మహిళలకు డబ్బులు ఇస్తున్నారు ఓకే. కానీ కాపు సామాజిక వర్గంలోని పురుషులు మాత్రం దీనిపై చర్చించుకుంటున్నారు. వారు చిన్న సమస్యను ఎదుర్కొంటున్నారు.
 

జగన్ ఇచ్చే 15 వేలు కలుపుకుని మరో కొన్ని డబ్బులు ఇవ్వమని భర్తలను కాపు మహిళలు అడుగుతున్నారని ఆ డబ్బులకు మరిన్ని డబ్బులు కలుపుకుని ఏదైనా వస్తువు కొనుక్కోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కాపు సామాజిక వర్గంకు చెందిన పురుషులు జగన్ పై కాస్త ఆగ్రహాంగానే ఉన్నారని ప్రచారం. మరి ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన జగన్ కు ఓట్లు పడతాయా? లేక కాపు నేత పవన్ కు ఓటేస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: