
ఒకరోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించి, మరొక రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి, మరొక రోజు ఫైబర్ గ్రిడ్ కేసు గురించి ఇలా రోజుకో కేసుపై మాట్లాడాలని ఫిక్స్ అయిపోయారు. కానీ కరెక్ట్ గా ఇదే టైం కి తెలుగు దేశం పార్టీ శ్రేణులు అసెంబ్లీకి బాయ్ కాట్ అని ప్రకటించేసరికి అసలు గొడవ మొదలైంది. తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన మీడియాలలో చంద్రబాబుకు అనుకూలంగానే కథనాలు వెలువడతాయి.
సాక్షి మీడియా అయితే చంద్రబాబు నాయుడుని బూతులు తిడుతూ చెప్పుకొస్తుంది. ఇలా ఎవరికి అనుకూలమైన మీడియాలో వాళ్ళకు సంబందించిన చర్చలే జరుగుతూ ఉంటాయి. ఈ రెండు పద్ధతులు కాకుండా తటస్థంగా మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పుకు వచ్చే పద్ధతి ఉండాలి. ఇలా తటస్థ భావాలను ప్రకటించేందుకు, ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా ఒక వేదిక ఉండాలి. అసెంబ్లీలో అయితే తటస్థ భావాలకు తగ్గట్టుగా పరిస్థితి ఉంటుంది.
కానీ తెలుగు దేశం పార్టీ శ్రేణులు తాము అసెంబ్లీకి రామని చెప్పడం జరిగింది. ఇద్దరు తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వర్గాల వారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలవారు ఒకచోట కూర్చుని పరస్పరం చర్చించుకుంటేనే అసలు విషయాలు సామాన్య జనానికి తెలియడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ పరిస్థితి అటు పేపర్ల లోనూ లేదు. ఇటు మీడియాలో కూడా లేదు.