ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ మరో తరహా ప్రచారం నిర్వహిస్తోంది. ఇటుక బట్టీల దగ్గర నుంచి పత్తి ఏరివేత దాకా అన్ని లేబర్ పనులు బిహార్ వాళ్లే చేస్తున్నారు. అన్ని రకాల వంటలు చేయడానికి ఒడిషా వాళ్లు వస్తున్నారు. హోటళ్లు, టీ స్టాళ్లు, ఇతర వ్యాపారాలను రాజస్థాన్ వాళ్లు నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ వాళ్లు ఇంటికి టైల్స్ దగ్గర నుంచి ఇంటీరియర్స్ వర్క్ వరకు అన్నీ పనులు చేస్తున్నారు.
నర్సింగ్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో కేరళ వాసులే ఉంటున్నారు. అన్ని రకాల బిల్డింగ్ పనులను ఏపీ ప్రజలు నిర్వహిస్తున్నారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతుంటే మనం మాత్రం మందు, మాంసం ఎవరు పంచుతారా.. ఓటుకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారా అని ఆలోచించుకుంటూ ఉంటున్నాం
తెలిసిన పనిని.. చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృథా చేస్తూ మద్యానికి, ఉచితాలకు బానసలవుతున్నారు అంటూ ఓ ప్రచారం చేస్తున్నారు. దాదాపుగా ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి వ్యవసాయ పనులతో సహా అన్నీ చేస్తున్నారు. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడ వాళ్లు అక్కడ చెప్పుకుంటున్నారు అంతే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి