
అయితే గతంలో కాంగ్రెస్ ఈ విధానాన్ని పాటించేది. సీఎం అంశం గోప్యత పాటిస్తున్నామని చెప్పినా మరో పక్క లీకులు వస్తూనే ఉండేవి. అదే బీజేపీలో అయితే అలాంటివి ఏమీ ఉండవు. తెలంగాణలో మంత్రి వర్గం శాఖలే కేటాయించలేదు. ఇంతలోనే మంత్రుల శాఖలు అన్నీ బయటకు వచ్చాయి. అలా ఉంటుంది కాంగ్రెస్ పరిస్థితి. ఇలాంటి సోషల్ మీడియా యుగంలో కూడా బీజేపీ వ్యూహాలు బయటకు రావడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు ప్రధాని మోదీ ప్రకటించేవరకు నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ మహిళా రిజర్వేషన్ బిల్లులు ఎవరికీ తెలియదు. ఈ వ్యూహాలు తెలిసింది ఇద్దరికే. ఒకరు అమిత్ షా అయితే రెండో వ్యక్తి మోదీ. బీజేపీ జాతీయాధ్యక్షుడు కాబట్టి నడ్డా ప్రమేయం ఉండే అవకాశం ఉంది. కానీ మోదీ, షా వ్యూహాలు మాత్రం ఎవరకీ తెలియదు. బయటకి కూడా రావు.
మనం కొన్ని ఉదాహరణలు చూసుకుంటే ప్రచారకర్తల జాబితాలో లేని యోగీ విదేశీ పర్యటన తలపెట్టడంతో విదేశాంగ శాఖ ద్వారా ప్రధాని ఆపేయించి.. అమిత్ షా అప్పటికప్పుడు దిల్లీకి పిలిపించి మీరే సీఎం అంటూ లఖ్ నవూ కు పంపారు. అలాగే పాలనానుభవమే లేని భూపేంద్ర పటేల్ నియామకం కూడా ఇలానే జరిగింది. అలాంటిది ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఏంచేస్తారో అనే ఆసక్తి ఆపార్టీ నాయకుల్లోనే ఉంది. మొత్తంగా సీఎం అభ్యర్థులు ఎవరు అనే విషయం ఈ ముగ్గురికి మాత్రమే తెలుసు. వీరి రహస్యాలను చేధించడం ఎవరి తరం కాదు.