సమయం లేదు మిత్రమా రణమా.. శరణమా ఇది బాలకృష్ణ సినిమాలో ఓ డైలాగ్. ఇది ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కచ్ఛితంగా సరిపోతుంది. ఎందుకంటే ఏపీలో మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం  మారిపోతుంది. అధికార వైసీపీ తిరిగి మరోసారి ప్రభుత్వం చేజిక్కించుకుంటుందా.. లేక టీడీపీ కూటమి తన ప్రభావాన్ని చాటుతుందా అనేది మరొకొన్ని రోజుల్లో తెలయబోతోంది.


ఇదిలా ఉండగా అధికార వైసీపీని గద్దె దించాలని టీడీపీ, జనసేన, బీజేపీ లు భావించి ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలద్దనే భావనతో పొత్తు పెట్టుకుని సీట్లను పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సిన మూడు పార్టీల మధ్య ఇంకా భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఎజెండా ఒకటే అయినప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. వాటిని గుర్తెరిగి ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం కృషి చేయాలి.


టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తమ పరపత్యాలను వదిలిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరికీ సీటు ఇచ్చినా  గెలిపించుకునేందుకు తమ శక్తిమేర ప్రయత్నం చేయాలి. అలా అయితేనే కూటమి విజయం సాధిస్తుంది. లేకపోతే ప్రతికూల ఫలితాలు ఎదురవ్వక తప్పదు. ముందు ఈ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు మనసులు కలవాలి. టికెట్ రాలేదనే స్పర్థలు ఉండకూడదు.


అసమ్మతులు, అసంతృప్తులను మాట్లాడి బుజ్జగించాలి. లేకపోతే పక్కన పెట్టి ముందుకు వెళ్లాలి. అంతేకానీ అక్కడే ఆగిపోతే ప్రచారానికి సమయం ఉండదు. మరోవైపు ఓట్ల బదాలయింపు సక్రమంగా జరగదు. ముందు ఆయా పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలి. అందరి లక్ష్యం ఒకటే కాబట్టి ఆ మేర కృషి చేయాలి. ఆ తర్వాత పార్టీ నాయకుల్లో ఒక రకమైన పాజిటివ్ వేవ్ వస్తోంది. ఇది ఓటర్లపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఓట్లు పోలరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ అంశంపైనే ఈ మూడు పార్టీల అధ్యక్షులు దృష్టి సారించాల్పిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: