తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు హాజరవుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  తెలిపారు.


పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించి సందేశం ఇస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాత్రి 7 గంటల నుండి 9 వరకు ట్యాంక్ బండ్ పై కళారూపాలతో కార్నివాల్.. 5వేల మంది పోలీసులతో బ్యాండ్ ప్రదర్శనలో ఉంటాయని శాంతికుమారి వివరించారు. ట్యాంక్ బండ్ పై 80 స్టాళ్లలో హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాల వస్తువులు, నగరంలోని ప్రముఖ హోటళ్ళ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.


పిల్లల కోసం క్రీడలతో కూడిన వినోద శాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బాణసంచా, లేజర్ షోలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర అవతరణ సందర్బంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విధ్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ తెలిపారు.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జరిపిన సమీక్షలో డీజీపీ రవీ గుప్తా, ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాస రాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి పరిశీలించారు. సభ వేదిక, బారికేడింగ్, విధ్యుత్,  మంచినీటి సరఫరా,  మైక్ సిస్టం, ఎల్ఈడీ స్ర్కీన్ లు, బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: