
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నెలకు ఉన్న ఆదాయం రూ.18,500 కోట్లు...జీతాలు,పింఛన్లకు నెలకు రూ.6,500 కోట్లు, ఈ అప్పులకు వడ్డీలకు రూ.6,500 కోట్లు నెలకు మేం కట్టాలి. మేం తిన్నా తినకపోయినా.. టీ తాగినా, తాగకపోయినా ప్రతి నెల పదో తేదీ లోపు రూ.13 వేల కోట్లు చొప్పున కట్టాలి. మిగిలిన రూ.5 వేల కోట్లు, రూ.5,500 కోట్లతో మేం అభివృద్ధి, సంక్షేమం చేపట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు గ్యారంటీలు అన్ని ఎలా చేయగలరని అడిగితే.. మీలాగే నేను కూడా రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నా. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా. కుర్చీలో కూర్చున్న తర్వాత అసలు విషయం బయటపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికీ నేను గ్యారంటీల గురించి చెప్పడం లేదు.. నేను అప్పులకు తిరిగి చెల్లించే గ్యారంటీల గురించి చెబుతున్నా...నేను గ్యారంటీలు చేయమని చెప్పడం లేదు. మా పరుగు సాగుతోంది.. మా పరుగును సాగనివ్వండి...వేగం ఉత్తేజాన్నిస్తుంది.. కానీ చంపేస్తుంది తెలుసుగా.. అన్నారు రేవంత్ రెడ్డి.
మోదీ ఢిల్లీలో అనేక గ్యారంటీలు ఇచ్చారు.. ఎవరూ మోడీని ప్రశ్నించడం లేదన్న రేవంత్ రెడ్డి… మోదీ గ్యారంటీలకు వ్యతిరేకమైతే ఢిల్లీలో ఎందుకు గ్యారంటీలు ఇచ్చారు. మేం 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణాలను మూడు నెలల్లోపు మాఫీ చేశాం. భారతదేశంలో తొలిసారి నేను ఇంత రుణమాఫీ చేశా… ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని చెప్పారు.