రైల్వే లో ఉద్యోగం
సాధించాలని ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అది
ఏ స్థాయి ఉద్యోగం అయినా సరే రైల్వేలో ఉద్యోగం చేస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది
ఉంటారు. ఈ క్రమంలోనే రైల్వే నుంచీ ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా అప్లై
చేస్తారు. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే 10వ తరగతి అర్హతతో ఉద్యోగ నియామక ప్రకటన
విడుదల చేసింది.
పోస్టుల వివరాలు : స్కౌట్స్ మరియు గైడ్స్ పోస్టులు
పోస్టుల సంఖ్య : 14
లెవెల్ 2 పోస్టులు : 2
లెవెల్ 1 పోస్టులు : 12
అర్హత : 10th పాస్ తో పాటు , ఐటీఐ / ఎన్ఎస్సి, ఇంటర్ పాస్.
వయసు : 18-30 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష , స్కౌట్స్ సర్టిఫికేట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
చివరి తేదీ : 11.11.2019
వివరాలు పంపవలసిన చిరునామా
సీనియర్ పర్సనల్ ఆఫీసర్ , నాలుగో అంతస్తు, రైల్ నిలయం , సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ 500025
తెలంగాణా స్టేట్
మరిన్ని వివరాలకోసం : https://scr.indianrailways.gov.in/