భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 86 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. న్యూఢిల్లీలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ట్రైఫెడ్.. పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వోద్యోగం అన్న భరోసాతోపాటు.. గిరిజనులకు సేవలందించే అవకాశం కూడా కలగడం వల్ల ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యం ఉంటుంది.


పోస్టులు వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఖాళీలు: 86 పోస్టులు.. ఇందులో జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ వంటి రకాల పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ పలు విభాగాల కిందకు వస్తాయి. అవేంటంటే.. మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెమోర్, లీగల్, ఆర్అండ్ డీ వంటివి.


ఇక ఈ ఉద్యోగాలకు అర్హతలను పరిశీలిస్తే.. చాలా వరకూ సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ అవసరం. కొన్ని పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం కూడా అవసరం ఉంటుంది. అభ్యర్థులు కింద పేర్కొన్న వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు పరిశీలించుకోవచ్చు.


కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబరు 30.

వెబ్ సైట్: http://www.trifed.in


మరింత సమాచారం తెలుసుకోండి: