కరోనా వైరస్.. ఈ వైరస్ కారణంగా ఎన్ని విధాలుగా ఎంతమంది నష్టపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు ఇప్పటికి పెరుగుతున్నాయి. లాక్ డౌన్ అమలు చెయ్యడం కారణంగా పిల్లల పరీక్షలు వాయిదా పడ్డాయి కానీ కరోనా కేసులు ఏం తగ్గలేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే డిగ్రీ సెమిస్టర్ ప‌రీక్ష‌ల‌ను జులై ఫ‌స్ట్ వీక్ లో నిర్వహించాలని ఓయూ స్టాండింగ్ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.  

 

దీంతో జూన్ 20 నుండి పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా వైరస్ కేసులు పెరగటం కారణంగా జులై ఫ‌స్ట్ వీక్ లో డిగ్రీ పరీక్షలు, జులై 15 నుంచి పీజీ సెమిస్టర్ ప‌రీక్ష‌లు నిర్వహించాలి అని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇంకా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తేనే పరీక్షలు నిర్వహించాలి అని లేకుంటే మళ్లీ భేటీ నిర్వహించి అయినా సరే నిర్ణయం తీసుకోవాలి అని అభిప్రాయానికి వచ్చింది. 

 

అయితే పరీక్షలు కూడా పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ చేశాక భౌతిక దూరం పాటించి ఒక బెంచుకు ఒక విద్యార్థి మాత్రమే ఉండాలి అని చర్యలు తీసుకున్నట్టు కమిటీసూచించింది . ఇంకా అలానే పరీక్షా సమయాన్ని కూడా మూడు గంటల నుడ్ని రెండు గంటలకు తగ్గించినట్టు ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి చెప్పారు. ఇంకా అంతేకాదు బ్యాక్లాగ్స్ ఉన్నవారిని డిటెండ్ చేయకుండా పై త‌ర‌గ‌తుల‌కు ప్రమోట్ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇంకా ఈ కరోనా కారణంగా పదో తరగతి పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పుతో పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ ద్వారా గ్రేడ్లు కేటాయించి పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.             

మరింత సమాచారం తెలుసుకోండి: