ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రజలకు మేలు చేస్తూ వస్తుంది.. ముఖ్యంగా విద్యార్థులకు.. ఒకవైపు రెండు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం కొనసాగుతున్నా.. మరోవైపు భారీ వర్షాలకు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నా కూడా పరీక్షలు నిర్వహించడం లేదా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు..గతంలో పరీక్షలు రాసి కొన్ని కారణాల వల్ల తదుపరి పరీక్షలు రాయలేని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పించింది.



నిరుద్యోగుల శాతాన్ని పూర్తిగా తగ్గించే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..టెట్ విషయం లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకసారి క్వాలి ఫై అయితే ఆ సర్టిఫికెట్ వాల్యూ ఇక లైఫ్ టైమ్ ఉండనుంది. గతంలో టెట్ పరీక్షలు రాసిన వారికి కాకుండా ఇప్పుడు కొత్తగా  టెట్, బీఈడీ పరీక్షలు రాసేవారికి ఈ పద్దతి అమలుకానుంది. భవిష్యత్ లో ఉద్యోగాల కొరకు పరీక్షలు రాసేవారు, టెట్ పరీక్షలు రాసేవాళ్ళు వీటిని తప్పక తెలుసుకోవాలి..గతంలో రాసి క్వాలిఫై అయిన వారి విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకొని నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తాజాగా వెల్లడించింది.



ఈ ఒక్క అభిప్రాయం వల్ల నిరుద్యోగ సమస్య పూర్తిగా తగ్గిపోతుందనీ కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మన దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి అనుకునే అభ్యర్థులకు నిర్వహించే అర్హత పరీక్ష ఇది. మరో విషయమేంటంటే  ఈ టెట్ పరీక్షను కూడా రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1వ నుంచి 5వ తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 1 నిర్వహిస్తారు. ఆ పై తరగతులు అయిన ఆరు నుంచి ఎనిమిది తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 2 నిర్వహిస్తారు. సీటెట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఉత్తీర్ణులకు ఏడేళ్ల గుర్తింపుతో సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇది నిజంగానే శుభవార్త అని టీచర్ పోస్టులకు సంబంధించిన వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: