ప్రతి ఏటా డిగ్రీలు పుచ్చుకున్న విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటే.. ఉద్యోగాలు పొందే వారి సంఖ్య మాత్రం వందల్లో ఉంటుంది. అయితే మిగిలిన వాళ్ళంతా కూడా ఉద్యోగ అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ లో జాబ్ కొట్టాలని చాలా మంది కల కంటారు. కానీ కొందరికి ఇంటర్న్‌షిప్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నది మాత్రం తెలియదు. గూగుల్ లాంటి పెద్ద కంపెనీల లో ఉద్యోగాలను సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ముందుగా ఆ కంపెనీ లో ఇంటర్న్‌షిప్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.. 



హైదరాబాద్, బెంగళూరు లోని గూగుల్ క్యాంపస్‌ లో ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది గూగుల్. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. https://careers.google.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 11 చివరి తేదీ. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వారు ఇండియాలోనే ఉండాలి. ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 



డిగ్రీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ కు అర్హులు అని కంపెనీ పేర్కొన్నారు.. విద్యార్హతలు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటే Apply పైన ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీ జీమెయిల్ ఐడీ తో లాగిన్ కావాలి. మీ సీవీ లేదా రెజ్యూమె అప్‌లోడ్ చేయాలి. మీ విద్యార్హతల వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. హైదరాబాద్‌, బెంగళూరు క్యాంపస్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన పని లేదు.. ఈ ఇంటర్న్‌షిప్ కు ధరకాస్తు చేసే వాళ్లకు జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గరిథమ్స్ తెలిసి ఉండాలి.. వీటితో పాటుగా ఒరాకిల్ వంటి వాటిలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలి. అప్పుడే జాబ్ కొట్టడం ఈజీ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: