ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది . ఎప్పటినుంచి ఏపీ ప్రభుత్వం మిగిలిఉన్న 300 పోస్టులను  భర్తీ చేసేందుకు అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతోంది .(APSSDC) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 300 పోస్టులను  భర్తీ చేయనున్నారు. DECCAN FINE CHEMICALS india PVT LTD లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రొడక్షన్ విభాగంలో 300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 6 న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్ లో తెలిపారు.


విద్యార్హత వివరాలు:
ప్రొడక్షన్ విభాగంలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
డిగ్రీ ( బిఎస్సి కెమిస్ట్రీ ) చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
2016 నుంచి 2020 సంవత్సరాల మధ్య పాసైన వారు ఈ దరఖాస్తుకు అర్హులు.

వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,660 వరకూ వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టు కు కేవలం పురుషులు మాత్రమే అర్హులు.

ఇంటర్వ్యూ వివరాలు:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ' రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్..
రమణయ్యపేట, నియర్ సర్పవరం జంక్షన్, ఎస్ఆర్    ఎంటీ బ్యాక్ సైడ్, కాకినాడ -533005'
చిరునామాకు  నిర్ణీత సమయానికి హాజరుకావాలని అధికారులు తెలిపారు. మార్చి 6 వ తేదీన ఉదయం 9 గంటలకు అభ్యర్థి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఇతర ఏమైనా సందేహాలుంటే 9010737998 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు APPSDC వారు.

ఇదే విధంగా చాలా రంగాలలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగులకు ఒక చక్కని అవకాశం లాంటిది. అంతేకాకుండా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయా కంపెనీల లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేస్తోంది ప్రభుత్వం.కాబట్టి నిరుద్యోగులు త్వరపడాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: