ఈ రోజుల్లో చదువున్నా కూడా ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుంది. టెక్నాలజీ పోటీ పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుతున్నారు. పది పాసయ్యిన వారికి కూడా మంచి జాబ్స్ అందుబాటులో ఉన్నాయట. అవును అవేంటో ఒక్కసారి చూద్దాం.. పోస్టల్ జాబ్స్.. ఈ ఉద్యోగాలకు పది అర్హత ఉన్నా కూడా సరిపోతుందని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. గతంలో పది పాసయ్యిన వాళ్ళు ఎందరో పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను మే 26 చివరి తేదీ కాగా, ఈ పోస్టులకు అప్లై చేసుకొని వారందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ మరో అవకాశాన్ని అందిస్తుంది. దరఖాస్తు గడువును 2021 జూన్ 25 వరకు పొడిగించింది. జూన్ 25 సాయంత్రం 5 గంటల్లోగా ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తుంది. మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. చెన్నై లోని మెయిల్ మోటార్ సర్వీసు లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవాలి. ఇకపోతే ఈ పోస్టులకు విద్యార్హతలు పది పాస్ అయ్యి ఉండాలి. అప్లై చేసుకొనేవాళ్లకు మూడేళ్ల లైట్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.ఇక ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు వయస్సు 2021 మే 26 నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. https://www.indiapost.gov.in/  ఈ ఉద్యోగాల కోసం పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: