తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఏడాది జూన్ నెలలో పరీక్షలు నిర్వహించే విధంగా ఉన్నట్లు తెలియజేస్తోంది ఆ ప్రభుత్వం.. ఇక వీటికి సంబంధించి షెడ్యూల్స్ ను కూడా త్వరలో విడుదల చేస్తామని ఆ విద్యాశాఖ మండలి ప్రకటించారు. ఇప్పటికే జూన్ నెలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులకు ఒకే పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే సెట్ కన్వీనర్ గా జె.ఎన్.టి.యు ప్రొఫెసర్ గోవర్ధన్ ని కూడా నిర్మించడం జరిగింది.

ఇక ఈ వారంలో ఎంసెట్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి  ఒక ప్రక్రియను విడుదల చేస్తామని అధికారులు తెలియజేయడం జరిగింది. ఫలితాలను కూడా కేవలం 30 రోజుల వ్యవధిలోనే తెలియజేస్తామని విద్యాశాఖ మండలి వారు తెలియజేశారు.. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఎంసెట్ ఎగ్జామ్ చాలా ఆలస్యం అవుతోందని.. ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతోనే పరీక్షను, సీట్లను కేటాయించాలని అధికారులకు తెలియజేశారు. ఇక ఫీజుల పెంపు విషయంలో  కసరత్తు ఉంటుందని తెలియజేసింది ప్రభుత్వం.. ఇక 2019 వ సంవత్సరం పెంచిన ఫీజులు గత సంవత్సరం వరకు అమలులో ఉన్నాయని తెలిపింది. అయితే ఆఫీసులను ఈ ఏడాది కూడా అమలు లో ఉంచే అవకాశం ఉన్నట్లుగా తెలియజేసింది ఆ ప్రభుత్వం.

ఇక కాలేజీల నుంచి సంబంధించిన ఆదాయ, వ్యయాల నివేదికను సిద్ధం చేసుకోవాలని కాలేజీలో యజమానికి ప్రభుత్వం సూచించింది.. ఈ నెల ఆఖరి వరకు ఈ గడువును ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతనే కాలేజీల ఫీజు పెంపు పై నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలియజేసింది ప్రభుత్వం.. అయితే  మీడియా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం..15% వరకు ఫీజు పెంచ బోతున్నారు అన్నట్లుగా సమాచారం. కాలేజీల్లో సీట్లు కేటాయింపు మాత్రం జూన్ ఆఖరుకల్లా పూర్తి అయ్యే విధంగా ఉన్నత మండలి అధికారులు ప్లాన్ చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందే కాలేజీలకు గుర్తింపు పొందిన ప్రక్రియను చెక్ చేసి అధికారులకు ఇవ్వాలని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: