పసిడి ప్రియులకు చేదు వార్త..మొన్నటి వరకు కొంతగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు పరుగులు పెడుతున్నాయి..గత రెండు రోజులు క్రితం భారీగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు పైకి కదిలాయి..గోల్డ్ రేట్ల పైనే వెండి ధరలు ఆధార పడుతున్నాయని తెలిసిందే. వెండి ధర కూడా పై పైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరగడంతో దేశీ మార్కెట్‌ లోనూ ఇదే ట్రెండ్ కనిపించిందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అంటున్నారు. పండగలకు బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ఈరోజు ధర నిరాశ కలిగిస్తుంది..


అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు విషయాని కొస్తే..హైదరాబాద్ మార్కెట్ ‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పైకి కదిలింది. రూ.46,200కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.330 పెరిగింది. రూ.50,400కు పెరిగింది. ఇక వెండి ధర విషయానికొస్తే.. బంగారం ధరల పైనే ఆధారపడి నడిచింది. 


ఈ రోజు మార్కెట్ లో భారీగా పెరిగింది..వెండి రూ.800 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.70,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి రేట్లు పెరుగుతున్నాయని నిపుణుల వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్‌ లోనూ బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.91 శాతం పెరుగుదలతో 1861 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.16 శాతం పెరుగుదలతో 25.72 డాలర్లకు చేరింది. పండుగకు బంగారం ధరలు తగ్గుతాయని అనుకున్న వారికి ఈ రోజు ధర షాక్ ఇస్తున్నాయి.. మరి ఈ నెల చివరి లోగా తగ్గుతుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: