బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం.. ఎప్పుడూ కొత్త వాటిని కొనాలని ఆలొచిస్తున్నారు.ఈ ఏడాది మే నుండి పెద్దగా హెచ్చు తగ్గులు లేకుండా కదలాడుతూ ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర కనిష్టంగా 49,500, గరిష్టంగా రూ. 52,700 మధ్య పరిమితమైంది. అయితే ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ భారీ వడ్డింపు, మన రూపాయి, దేశీయ స్టాక్‌ మార్కెట్లపై భారీ ప్రభావాన్నే చూపుతోంది..


డాలరు మారకంలో మన కరెన్సీరూపాయి 81.62 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. అటు ఆసియా మార్కెట్లన్నీ బేర్‌ మంటున్నాయి. అలాగే డాలర్ ఇండెక్స్‌ బలం పుత్తడిపై కూడా పదింది. ఇది మరికొంత కాలం కొనసాగవచ్చనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లలో, ధరలు ఔన్సుకు 1680 డాలర్ల మార్క్ వద్ద గట్టి మద్దతు ఉందనీ, ఇది బ్రేక్‌ అయితే తప్ప బంగారం ధరలు దిగి వచ్చే ఛాన్సే లేదనది ఎనలిస్టుల మాట. కానీ,మద్దతు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.


పెరుగుతున్న ద్రవ్యోల్బణం , గ్లోబల్‌గా పలు సెంట్రల్‌ బ్యాంకుల అధిక వడ్డీ రేట్ల మధ్య ప్రపంచ మాంద్య భయాలు పసిడి ధరకు ఊతమిచ్చేవేనని చాలామంది ఎనలిస్టులు వాదన. ఇక దేశీయ మార్కెట్లలో, ధరలు 10 గ్రాముల రూ. 48,800 స్థాయివద్ద దగ్గర గట్టి మద్దతు ఉంటుంది. ఇది బ్రేక్‌ అయితే బంగారం ధరలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని దేశీయ బులియన్‌ ట్రేడర్ల అంచనా వేస్తున్నాయి.పెళ్లిళ్ల సీజన్, వివిధ పండుగలు నగల డిమాండ్‌ను పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఆయిల్‌, బంగారం ప్రధాన దిగుమతిదారుగా ఇండియాలో బంగారం ధరలపై ఆయిల్‌ ధరల ప్రభావం కూడా ఉంటుంది. పంట చేతికి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోపుంజుకునే డిమాండ్, తక్కువ ధరల్లో పెట్టుబడి డిమాండ్‌ను పెంచుతుందని, గ్లోబల్‌ అ నిశ్చితుల నేపథ్యంలో బంగారం వైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందంటూ సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు...ఎటు చూసినా బంగారం ధర మాత్రం తగ్గేలా లేదని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: