కాఫీ: ఎక్కువ తాగితే ఈ జబ్బులు తప్పవు?

కాఫీ తాగడం వల్ల మీ శరీరం రిఫ్రెష్ అవుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని నిద్రలేమి, అలసట తొలగిపోతాయి.కొంతమందికి బ్లాక్ కాఫీ తాగందే నిద్రపట్టదు. తమ రోజు గడవదు. దీన్ని తాగడాన్ని వారు ఒక వ్యసనంగా మార్చకుంటారు . కొంతమంది అయితే గ్యాప్ లేకుండా కప్పుల మీద కప్పుల కాఫీ తాగేస్తుంటారు. ఈ నేపథ్యంలో మోతాదుకు మించి కాఫీ తాగడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ విషయంలో అలక్ష్యం వహిస్తే మెదడు సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న కెఫిన్ నిద్రలేమికి కారణమవుతుంది. ఇది క్రమంగా పనిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాగా డిమెన్షియా అనేది ఒక రకమైన మానసిక సమస్య. దీని బారిన పడిన వారు మానసికంగా కుంగిపోతారు. 


వారి ప్రవర్తన సాధారణ మనుషుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రోజుకు 5 నుండి 6 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగే వారికి డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు, అధిక కెఫిన్ అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. మోతాదుకు మించి కెఫిన్ త్వరగా రక్తపోటును పెంచుతుంది. దీని వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బీపీ ఎక్కువగా ఉన్నవారు బ్లాక్ కాఫీని ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కాబట్టి కాఫీని ఎక్కువ తాగకుండా మితంగా తాగండి. ఇలాంటి ప్రమాదకర జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకి రెండు సార్లు చాలు. అంతకంటే ఎక్కువ తాగొద్దు.బ్లాక్ కాఫీ, అయిన మాములు కాఫీ అయిన టీ అయిన ఏదైనా కూడా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: