టిడిపి జనసేన బిజెపి పార్టీలు కూటమి ఒప్పందం కుదుర్చుకున్నప్పటినుంచి చాలా తలనొప్పిగా మారింది.. మొదటి నుంచి టిడిపి జనసేన పార్టీ కోసం పనిచేసి.. కోట్ల రూపాయలు ఖర్చుచేసిన  నేతలను కాకుండా నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్లు కేటాయించడంతో అటు టిడిపి జనసేన పార్టీలో నేతలు సైతం వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టిడిపి పార్టీలో సీనియర్ నేతలకు ఇలా కష్టపడిన నేతలకు విలువ లేకుండా చేస్తున్నారని విషయం పైన టిడిపి పార్టీ అధినేత చంద్రబాబుపైన చాలామంది నేతలు మండిపడుతున్నారు.


ఈ పరిస్థితుల్లోనే కొందరు రెబల్స్ గా నామినేషన్ వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీ కోసం పని చేసిన నాయకులను కాకుండా పక్క ప్రాంతం నుంచి తెచ్చుకొని మరి వారికి బాధ్యతలు ఇవ్వడంతో టిడిపిలో చాలా నేతలు అసహనంతో ఉన్నారట.. తిరుపతి లోక్సభ తో పాటు తిరుపతి శ్రీ కాళహస్తి గంగాధర నెల్లూరు చిత్తూరు అసెంబ్లీ స్థానాల నుంచి కూటమి అభ్యర్థులకు రెబల్స్ బెడదతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎన్నో చర్చలు జరిపిన అవేవీ ఫలించేలా కనిపించడం లేదట.


పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన నేతలు ససేమీర వీరిని అసలు ఒప్పుకోలేదట. తిరుపతి లోక్సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా వరప్రసాద్ ఉన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు దాసరి శ్రీనివాసులు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు.. అలాగే తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు అక్కడ ప్రజలకు ఒక మంచి పని కూడా చేయలేదు.. పెద్ద ఎత్తున ఈయన పైన అవినీతి మచ్చ ఉన్నది. ముఖ్యంగా చిత్తూరు కార్పొరేషన్ లో ప్రతి పనికి కూడా హింసించే వారిని ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఓటమి కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఈయనకి జనసేన టికెట్ ఇవ్వడంతో కూటమిలో అసంతృప్తి కనిపించింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను అరణి శ్రీనివాసులకు బెదిరించడంతో విభేదాలు మొదలయ్యాయి.  ఇలాంటి వ్యక్తికి సహకరించామంటూ తిరుపతి ఓటర్లు డైరెక్ట్ గానే చెబుతుంటారు.


సత్యవేడు టిడిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆయన కుమారుడు సుమన్ వీరు గతంలో టిడిపి పార్టీ.. వైసీపీ నేతలను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వ్యక్తిని చంద్రబాబు అభ్యర్థిగా ఎంపిక చేయడం పైన మాజీ ఎమ్మెల్యే హేమలత,జేడి రాజశేఖర్,ఎన్నారై రమేష్ రెబల్గా నామినేషన్ వేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ఆదిమూలం ఇచ్చిన ప్యాకేజీ ఆశపడే అభ్యర్థిని ఖరారు చేశారని వాదనలు చంద్రబాబు పైన వినిపిస్తున్నాయి.


చిత్తూరు గంగాధర నెల్లూరు కూటమి అభ్యర్థులు.. గురజాల జగన్మోహన్, థామస్ స్థానికులు కాకపోవడంతో నాయకులకు విలువ ఇవ్వకపోగా.. వీరి వ్యాపారాలు ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి తెప్పించుకున్న మనుషులకు ఎక్కువగా విలువనిస్తున్నారట. అలాగే శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి కూటమినేతలను పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా రెబల్స్ తో కూటమి చాలా ఇబ్బందులు పడుతోందని ఒకవేళ వారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా దెబ్బ పడేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: