స‌హ‌జంగా మ‌న దేశంలో మన దేశంలో ఆయా వర్గాలకు చెందిన వారు తాము పూజించే దైవం కోసం ఉపవాసం ఉంటుంటారు. వారు ఇష్ట‌ దైవాన్ని పూజిస్తూ తాము బాగుండాల‌ని, ఆరోగ్యంగా ఉండాల‌ని.. ఇలా ఎన్నో మొక్కులు మొక్క‌తూ ఉప‌వాసం చేస్తారు. నిజానికి ఉప‌వాసం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు. 


ఉపవాసం అనే ఈ సంప్రదాయం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు, శరీరంలోపల క్లెన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉపవాసం శరీరంలోని ఎంజైమ్ వ్యవస్థపై ప్రభావం చూపి శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల అన్నీ.. ఇన్టీ లాభాలు కాదండోయ్‌.. ఎన్నో లాభాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 


- ఉపవాసం వల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుందట. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారట. 


- ఉపవాసం చెడ్డ కొవ్వు స్థాయిలు తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపకుండా వివిధ గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది.


- ఉపవాసం వల్ల ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ , వివిధ రకాల చర్మ సంబంధ సమస్యలను నుండి ఉపశమనం కలుగుతుంది.


- ఉపవాసం చేయడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. రక్తంలో ఫ్యాట్ లెవల్స్ కరుగుతాయి.దాంతో హైబ్లడ్ ప్రెజర్, ఇతర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.


- ఉపవాసం చేస్తే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు లాంటి స్వల్ప అనారోగ్య సమస్యలు నయమవుతాయి. 


- అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కూడా నయమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉపవాసం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.


- ఉపవాసం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, అనగా చిన్న చిన్న మొత్తాల్లోని ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, టైప్ 2 డయాబెటిస్ రాకుండా చేస్తుంది.


ఉపవాసం అంటే భయపడి తప్పనిసరి పాటించాల్సిన ఆచారం కాదు. దానిపై ఇప్పుడు పెరిగిన అవగాహనతో, సరైన విధానంలో పాటించి అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు ఆర్యోగ్యానికి అందుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: