టీనేజీ వ‌య‌సు అంత కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆనంద‌క‌రంగా ఉంటుందో అన్నే క‌ష్టాలు, ఇబ్బందులు కూడా ఎదురు అవుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకు  బాగా ఒత్తిడిని ఎదుర్కోవడం జరుగుతుంది. అటు ఎగ్జామ్స్‌, ఇటు బాయ్ ఫ్రెండ్స్‌తో క‌ష్టాలు, కెరీర్ ప్లాన్స్ అన్నీ క‌లగ‌లసి ఒకే సరి వస్తాయి . దీనికి అద‌నంగా ఈ మ‌ధ్యే ఒబేసిటీ స‌మ‌స్య తీవ్ర‌ త‌ర‌మ‌వుతుంది. అమెరికాలో 21 శాతం టీనేజ్ అమ్మాయిలు ఒబేసిటీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని సీఎన్ఎన్ నివేదిక కూడా తెలియచేయడం జరిగింది. టీనేజ్ ఒబేసిటీ వ‌ల్ల ఆత్మ‌విశ్వాసం కోల్పోవ‌డం, బులీమియా, డ‌యాబెటిస్ లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. ఇవ్వని స‌మ‌స్య‌లు ఎదురుకొనలంటే  టీనేజ్‌ ఫిట్‌నెస్‌ అనుసరిస్తే మంచిది, దీని వల్ల కొంచం ఉపశమనం కలిగిస్తుంది. టీనేజ్‌ ఫిట్‌నెస్‌ గురించి తెలుసుకుందామా మరి...

 

Related image

 

టీనేజ్‌పిల్లలు చదువు ధ్యాసలో పడి ఫిట్‌నెస్‌ గురించి అసలు పట్టించుకోరు. అయితే చదువు, కెరీర్‌ ముఖ్యమే గానీ, శరీరానికి కాస్తంత శ్రమ కలిగించకపోతే, స్థూలకాయం గ్యారెంటీ. స్కూలు, కాలేజ్‌ పిల్లల్లో కొందరు ఊబకాయంతో ఉండడం గమనించే ఉంటారు. గంటలు గంటలు మొబైల్‌ మీదో, నెట్‌ చాటింగ్‌ మీదో గడిపే సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి.

 

Image result for టీనేజ్‌ ఫిట్‌నెస్‌

 

అసలు  సమస్య టైం లేకపోవడం కాదు. వ్యాయామం ప్రాధాన్యతను గుర్తించకపోవడమే. అలాగని ఈ వయసులో వెయిట్‌ లిఫ్టింగ్‌, హెవీ రన్నింగ్‌లు చేయకూడదు. ఎముకలు వంకర్లు పోయే ప్రమాదం ఉంది. అలాంటివి 18 ఏళ్లు దాటాకే చేయాలి. అప్పటిదాకా సాదాసీదా వ్యాయామాలు, స్కూల్లో చెప్పే డ్రిల్‌ చేస్తే చాలు. వీటితో పోటు కొన్ని యోగాసనాలు, ప్రాణాయామాలు మంచిది.

 

వ్యాయామాలు స్థూలకాయం రాకుండా కాపాడటమే కాదు. శరీరాన్ని, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దాంతో గ్రహణ శక్తినీ, ఏకాగ్రతా బలాన్ని పెంచుతాయి. కండరాలు బలపడి, ఎముకలు ఏపుగా ఎదిగి, కావలసిన ఎత్తుపెరిగేలా చేస్తాయి. నిద్రలేమి, మలబద్ధకం వంటి సమస్యలనుంచి దూరంగా ఉంచుతాయి. శరీరాన్ని ఉత్సాహంగా, మనసును ఉల్లాసంగా చైతన్యవంతంగా ఉంచుతాయి. యోగా, వ్యాయామాలు ప్రత్యేకించి విద్యార్థులకు కావలసిన జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: