విటమిన్ డి.. మ‌న శ‌రీరానికి ఇది చాలా అవ‌స‌రం. అయితే నేటి కాలంలో చాలా మందిలో విటమిన్‌-డి లోపం కనిపిస్తుంది. విటమిన్ డి.. దీన్నే సన్‌షైన్ విటమిన్ అని అంటారు. సూర్యకాంతిలో రోజూ కొంత సేపు ఉంటే ఈ విటమిన్ మనకు లభిస్తుంది. శారీరక దారుఢ్యం ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్ డి మనకు అవసరం.  విటమిన్ D లోపిస్తే మధుమేహం, గుండె సంబంధ వ్యాధులకు గురయ్యే ప్రమాదముంది. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్త‌వానికి  డి విటమిన్ 30 నుంచి 100 యూనిట్ల వరకు ఉండడం అత్యవసరం. 

 

అయితే 30 యూనిట్ల కంటే త‌క్కువ ఉంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మ‌రి హాస్ప‌ట‌ల్‌కు వెళ్ల‌కుండా మ‌న‌కు విట‌మిన్ డి లోపం ఉంద‌ని ఎలా గుర్తించాలి..? అన్న‌ది ఇప్పుది తెలుసుకుందాం. అందులో ముందుగా  తరచూ అలసిపోవ‌డం. తరచూ అలసిపోవ‌డం విటమిన్ డి లోపం కారణం కావచ్చు. ఇలా తరచుగా అలిసిపోవడమనేది మీ రోజూవారీ పనుల మీద కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, అనేక ఇతరత్రా సమస్యలకు కారణమవుతుంది. అలాగే విటమిన్ డి లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. మీరు ఎన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నా, జుట్టు రాలడాన్ని అరికట్టలేకపోతే.. వెంట‌నే మీరు డి విట‌మిన్ టెస్ట్ చేయించుకుని త‌గ‌ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

 

అదేవిధంగా, విటమిన్ డి లోపం అనేక రకాల చర్మ సంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది. దద్దుర్లు పోవడం, మొటిమలు రావడం, వృద్ధాప్య చాయలు తలెత్తడం, తరచుగా చర్మం పగలడం వంటి అనేకరకాల సమస్యలు వీటిలో ఉన్నాయి. విటమిన్ డి లోపం కూడా మిమ్మల్ని అత్యంత తరచుగా అనారోగ్యానికి గురిచేస్తుంటుంది. అయితే సూర్యరశ్మికి బహిర్గతమయ్యే శరీరాలను విటమిన్ డి సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి రోజు శరీరానికి సూర్యరశ్మినితగిలేల చుస్కోవడం మంచిది. ఇక ఇతర విటమిన్లు మాదిరిగా కాకుండా, విటమిన్ డి ఆహార పదార్థాల్లో ఎక్కువగా కనిపించదు. అయినప్పటికీ, కొన్ని ఆహారాలలో చిన్న మొత్తాలలో విటమిన్ డి ను కలిగి ఉంటాయి.  అవి డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: