సాధారణంగామన పెద్దవాళ్ళు పరగడపన వేడి నీళ్లు తాగితే ఎంత లావు ఉన్నవారు అయినా ఇట్టే తగ్గిపోతారు అని చెప్తుంటారు.. అవును అది నిజమే. అయితే పరగడుపున వేడినీళ్లలోకి కాస్త జీలకర్ర వేసి ఉడికించి తాగితే నిజంగానే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మనం జీలకర్రను ప్రతి వంటకంలోను వేస్తాం. ఈ జీలకర్ర వల్ల వంటకాలకు రుచిని, సువాసనని ఇస్తుంది. ఇంకా అలాంటి ఈ జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని పరగడుపునే తాగితే మరెన్నో లాభాలు ఉంటాయి. అంతేకాదే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మరి జీలకర్ర నీళ్ల వల్ల ఉపయోగాలు ఏంటోఇక్కడ చదివితెలుసుకోండి.. 

 

జీల‌క‌ర్ర నీళ్లు తాగడం వల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌పదుతుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, క‌డుపులో వికారం, క‌డుపులోని అల్సర్లు అన్ని కూడా వదిలిపోతాయి. 

 

జీల‌క‌ర్ర నీరు తాగడం వల్ల మూత్రం ధారాళంగా వ‌స్తుంది. కిడ్నీరాళ్లు కూడా క‌రుగుతాయి. కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు అన్ని వదిలి పోతాయి. అంతేకాదు నీళ్ల విరేచనాలు కూడా తగ్గుతాయి.

 

మానసిక ఒత్తిడిని దూరం చేసే మంచి ఔషధం జీలకర్ర. 

 

జీలకర్ర మంచినిద్రను కూడా ఇస్తుంది.

 

డయాబెటిస్ ఉన్నవారు జీలకర్ర నీరు తాగిన రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

 

జీల‌క‌ర్ర నీరు తాగేవారికి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దీంతో రక్తస‌ర‌ఫ‌రా మెరుగు మెరుగుపడి గుండె స‌మ‌స్య‌లు రావు.

 

చూశారుగా.. జీలకర్రలోని లాభాలు మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే జీలకర్ర నీటిని వారానికి ఒకసారి అయిన తాగి మంచి ఆరోగ్యాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: