ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మల్టీ గ్రైన్ రోటీ తినటం వలన షుగర్ తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెళ్లడయింది. ఈ మల్టీ గ్రెయిన్ రోటీలో సజ్జలు, రాగులు, జొన్నలు ఉన్నాయి. ఈ మూడూ కూడా షుగర్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేయడంలో చాలా పాప్యులర్. సజ్జలు, జొన్నల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కాలంగా ఉంటాయి. ఇవి అరగడానికి చాలా టైమ్ తీసుకుంటాయి, బ్లడ్ లోకి షుగర్ రిలీజ్ కూడా స్లోగా జరుగుతుంది. రాగికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, పైగా రాగిలో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మల్టీ గ్రెయిన్ లో హోల్ వీట్ కూడా ఉంటుంది, ఇంకా కొద్దిగా శనగపిండి కూడా కలుపుతారు.

మల్టీ గ్రైన్ రోటీని ఇలా తయారు చేసుకోవచ్చు...

ముందుగా కావాల్సిన పదార్ధాలు...

రాగి పిండి - మూడు టేబుల్ స్పూన్లు

సజ్జ పిండి - మూడు టేబుల్ స్పూన్లు

జొన్న పిండి - మూడు టేబుల్ స్పూన్లు

పూర్తి గోధుమ పిండి - మూడు టేబుల్ స్పూన్లు

శనగ పిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్

టమాటా - ఒక టేబుల్ స్పూన్, సన్నగా తరగాలి

ఉల్లిపాయ - ఒక టేబుల్ స్పూన్, సన్నగా తరగాలి

కొత్తిమీర - ఒక టేబుల్ స్పూన్, సన్నగా తరగాలి

కారం - రెండు టీ స్పూన్లు

ఉప్పు - రుచికి తగినంత

జీల కర్ర - రెండు టీ స్పూన్లు

నూనె - తగినంత


తయారు చేయువిధానం.....

నూనె తప్ప మిగిలిన అన్ని పదార్ధాలనీ కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తని ముద్దలా తయారు చేయండి. అన్ని పదార్ధాలూ బాగా కలిసేలాగా జాగ్రత్త తీసుకోండి.ఈ ముద్దని చిన్న చిన్న భాగాలుగా విడకొట్టి పదిహేను నిమిషాలు పక్కన ఉంచండి.రోటీలు చేయడానికి, ఒక చిన్న ముద్ద తీసుకుని, కొంచెం పొడి పిండితో చపాతీ లా ఒత్తుకోండి.నాన్ స్టిక్ పెనం మీద కొద్ది నూనె వేసి ఈ రోటీని కాల్చండి.రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చండి.మిగిలిన రోటీలు కూడా ఇలాగే చేసి వేడి వేడిగా వడ్డించండి.ఇలాంటి మరెన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: