ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను దెబ్బతీస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి గత సంవత్సర కాలంగా దాని హవా కొనసాగిస్తోంది. దాని నివారణకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఫార్మా కంపెనీలు వాక్సిన్ తయారీలో విశేషమైన కృషి చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వాక్సిన్ లకు సంబంధించి చివరి దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ కరోనా మహమ్మారి వ్యాధి సోకిన వారిలో గుర్తించేటువంటి లక్షణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, దగ్గు మరియు గొంతు సంబంధిత సమస్యల వంటి లక్షణాలు కనిపించేవి. కానీ తరువాత కాలంలో జుట్టు రాలడం వంటి సూక్ష్మ సంకేతాలు కూడా వచ్చాయి.



కోవిడ్ -19 సోకిన వారిలో ప్రతి రోజు కలిగే ప్రతి మార్పును అర్థం చేసుకునే ప్రయత్నంలో, శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు అనేక రకాల అధ్యయనాలు చేశారు. ఆ నివేదికల ప్రకారం ఇటీవలే కనుగొన్నమరొక లక్షణం... జుట్టు రాలడం. ముఖ్యంగా కోవిడ్ సోకిన సమూహన్నీ ‘లాంగ్ హాలర్స్’ అని పిలుస్తారు. ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు సర్వైవర్ కార్ప్ ఫేస్‌బుక్ గ్రూప్ సర్వేకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, ఈ అంటు వ్యాధితో బాధపడుతున్నవారు అనుభవించిన మొదటి 25 లక్షణాలలో జుట్టు రాలడం కూడా ఉందని తేలింది. కోవిడ్ -19 యొక్క ప్రభావాలను ఎక్కువ రోజులు అనుభవించిన సుమారు 1500 మందిపై ఈ సర్వే జరిగింది. ‘లాంగ్ హాలర్స్’ గా ఉన్నప్పుడు, వికారం మరియు ముక్కు దిబ్బడి కంటే జుట్టు రాలడాన్ని ఎక్కువగా అనుభవించారని ఈ సర్వే లో తేలింది.


చాలా మంది కరోనా వ్యాధి సోకిందేమోనని వాళ్ళు పడే ఒత్తిడి మరియు ఆందోళనకు సంబంధించి వారిలో జుట్టు రాలడం వంటి సమస్య తీవ్రతరం అయి ఉండవచ్చని కొంతమంది నిపుణులు అంటున్నారు. దీనిని ‘టెలోజెన్ ఎఫ్లూవియం’ అని పిలుస్తారు. అలాగే శరీరం ఎక్కువ ఒత్తిడిని అనుభవించినప్పుడు, షాక్ లేదా అనారోగ్య సమయంలో కూడా ఈరకంగా జుట్టు రాలడం లాంటి తాత్కాలిక సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా, సంక్రమణ కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం వల్ల, పోషక ఆహార లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. అయితే వీటికి ఇంకా సరైన శాస్త్రీయ రుజువులు లేకపోవటం వల్ల ఏమీ ఖచ్చితంగా చెప్పలేకున్నారు.
 

శాస్త్రీయంగా ఈ విషయంపై ఎలాంటి నిరూపణలు లేనప్పటికీ జుట్టు రాలడం తాత్కాలిక దశ అని నిపుణులు సూచిస్తున్నారు మరియు కోవిడ్ రోగులు తమ మానసిక మరియు శారీరక ఒత్తిడి స్థాయిని తగ్గించడంపై దృష్టి పెట్టాలి. అలాగే వ్యాధి నుండి రికవరీకి ఆహారం చాలా ముఖ్యమైన అంశం. విటమిన్ డి మరియు ఐరన్ అధికంగా ఉండే పోషక ఆహారాలు శరీరానికి చాలా మంచిది. విటమిన్ డి మరియు ఐరన్ వున్న ఆహారాలు ప్రభావవంతంగా పని చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇవి పాటించటం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలపడి వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడటం ద్వారా కరోనా వైరస్ త్రివత తగ్గుతుంది. వాటితో పాటుగా ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: