ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. బొప్పాయి పండు వల్ల చాలా ప్రయోజనాలు వున్నాయి. అందుకే బొప్పాయిని పండ్లన్నిటికి రారాజు అంటారు. ఇక ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం....జలుబు, జ్వరాలు రాకుండా బొప్పాయి నివారిస్తుంది.రోజూ బొప్పాయి తినడం కంటి చూపుకు కూడా మంచిది.ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్స్ వల్ల పెద్ద పేగు, ప్రొస్టేట్ క్యానర్లు వచ్చే ముప్పు తగ్గుతుంది.ఈ పండులో ఉండే పపైన్, కిమోపపైన్ ఎంజైమ్‌లు కడుపులో మంటను తగ్గిస్తాయి. కిమోపపైన్, పపైన్ ఎంజైమ్‌ల వల్ల గాయాలు త్వరగా మానతాయి. చర్మ సంరక్షణకు బొప్పాయి ఎంతో ఉత్తమం. దీన్ని చర్మానికి రాసుకుంటే.. పపైన్ అనే ఎంజైమ్ వల్ల శరీరం కాంతివంతం అవుతుంది.


బొప్పాయితో మొటిమలు తగ్గుముఖం పడతాయి. చర్మంపై ముడతల నివారణిగా ఈ పండు పనిచేస్తుంది.బొప్పాయిలోని ల్యూటిన్, జియాక్సాన్‌థిన్, క్రిప్టాక్సాన్‌థిన్ అనే ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షిస్తాయి.ఫ్రీ రాడికల్స్ వల్ల త్వరగా వయసు మీద బడటంతోపాటు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి బొప్పాయి తినడం మంచిదే.రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే విటమిన్-A, విటమిన్-C బొప్పాయిలో ఉంటాయి.బొప్పాయి పండులో పీచు పదార్థం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి. బొప్పాయిలో అధిక పీచుపదార్థాలు, తక్కువ కేలోరీలు ఉంటాయి. కాబట్టి, ఇది తింటే సులభంగా బరువు తగ్గుతారు.బొప్పాయి ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో అతిగా తినలేం.బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-C, విటమిన్-K అధిక మోతాదులో ఉంటాయి.జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి చాలా మంచిది.

బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.మలబద్దకాన్ని నివారించేందుకు బొప్పాయి మంచి ఔషదంలా పనిచేస్తుంది.బొప్పాయిలో అల్సర్లను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: