సొరకాయను కూరల్లో వాడుతారు అని మనకి తెలుసు. కానీ సొరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.శరీరంలోని అధికవేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. సొరకాయలో అధిక శాతం నీరు ఉంటుంది.ఇందులో సోడియం తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలకు మంచి మందులా ఉపయోగపడుతుంది. సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.సొరకాయ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

 సొరకాయ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది.

 తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి సొరకాయ  జ్యూస్ సహాయపడుతుంది.ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.

 సొరకాయ గింజలను తినడం వల్ల వీర్యవృద్ధి కలుగుతుంది.అలా జరగడానికి సొరకాయ గింజలను వేయించి, కొంచెం ఉప్పు, ధనియాల పొడి జీలకర్ర కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో కలుపుకుని తినడం వల్ల వీర్య వృద్ధి కలుగుతుంది.

 సొరకాయలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును  మెరుగుపరచడానికి సహాయపడుతుంది.బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి సహాయపడుతుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు రోజు ఒక గ్లాసు సొరకాయ రసం లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

 సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల అతిసార, మధుమేహ సమస్యలు తగ్గుతాయి. శరీరం అధిక మోతాదులో సోడియంను తగ్గకుండా చూస్తుంది.

 సొరకాయ తినటం వల్ల శరీరంలో వేడి,కఫం తగ్గడమే కాకుండా, దప్పికను నివారిస్తుంది. వాంతులు. విరేచనాలు ఉన్నవాళ్లు సొరకాయ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: