సాధారణంగా నోటి దుర్వాసన మనం తీసుకునే ఆహారం, నోటి లోపల దంతాలలో చిక్కుకుపోయి, అది క్రమంగా చెడు వాసన కు దారితీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కారణం ఏదైనప్పటికీ నోటి నుంచి వెలువడే దుర్వాసన మనతో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించడం గమనార్హం. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల నోటి దుర్వాసన ను తగ్గించుకోవచ్చు. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

సిట్రస్ పండ్లు:
సిట్రస్ జాతికి చెందిన పండ్లు అయిన నిమ్మ,నారింజ, బత్తాయి వంటి పండ్ల ముక్కలను నమిలి మింగడం వల్ల చెడు శ్వాస నుంచి దూరంగా ఉండవచ్చు. ఇక అంతేకాకుండా  ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

దాల్చినచెక్క :
దాల్చినచెక్క యాంటీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల చెడు శ్వాసతో పోరాడి, నోటి దుర్వాసన రాకుండా అరికడుతుంది. అయితే దాల్చిన చెక్క ను నములుతూ ఉండటం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడవచ్చు.

పెరుగు:
పెరుగులో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉండడం వల్ల ఇది చెడు శ్వాస కు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

లవంగాలు:
లవంగాలు సుగంధ మూలికలుగా పిలవబడతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. అందువల్ల  లవంగాలు నమలడం వల్ల నోటి దుర్వాసన ను తగ్గించుకోవచ్చు.

 కొత్తిమీర :
నోటి దుర్వాసన చికిత్సలో కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే అధిక స్థాయి క్లోరోఫిల్ మన నోటి దుర్వాసన దూరం చేసి, నోరు తాజాగా ఉండేలా చేస్తుంది.

పైనాపిల్ రసం :
భోజనం చేసిన తర్వాత పైనాపిల్ ముక్కలు నమలడం వల్ల నోటి దుర్వాసన నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా పైనాపిల్లో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. ఫలితంగా దంతక్షయం ఏర్పడే అవకాశం ఎక్కువ.  కాబట్టి పైనాపిల్ ముక్క తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం మంచిది.

 పుదీన :
పుదీన మంచి సువాసనతో పాటు తాజాదనాన్ని కూడా నోటికి అందిస్తోంది.  కాబట్టి పుదీన  ఆకులు నోట్లో వేసుకుని నమలుతూ ఉండటంవల్ల తాజా శ్వాసను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: