ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇక అలాంటి వారు పెద్దగా కష్టపడకుండా సింపుల్ గా బరువు తగ్గడానికి ఈ పద్ధతులు పాటించండి...చాలా మంది నిద్ర విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి ఇప్పటినుండి నిద్ర విషయంలో టైమ్ మెయింటెయిన్ చేయండి. దీని వల్ల మీ బాడీలో ఎలాంటి ఫ్యాట్ ఏర్పడదు. దీని వల్ల మీరు సులభంగా బరువు తగ్గొచ్చు.ఎవరైతే సరైన సమయానికి ఆహారం తీసుకుని.. సరైన సమయంలో నిద్రపోతారో వారికి అనారోగ్యాలు అనేవి దరి చేరవు.ప్రతిరోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీని తాగండి.



దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒక వారంలో మీరు 500 కేలరీల వరకు వెయిట్ తగ్గుతారు. మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. షుగర్ ఉండే వారికి కూడా ఇది చాలా మంచిగా పని చేస్తుంది.యోగా అనేది మనం ఎప్పుడు.. ఎక్కడ ఉన్నా సులభంగా చేసే వ్యాయామం. దీనికి ఎలాంటి ఎక్విప్ మెంట్స్ అవసరం లేదు. మీ ఇంట్లో లేదా పార్కులో లేదా ఇంకా ఏ ప్రాంతంలో అయినా సులభంగా దీనిని చేయొచ్చు. అయితే మ్యాట్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు అది లేకపోయినా యోగా చేయొచ్చు. ఇది మీ కండరాలను బలంగా మార్చేందుకు దోహదం చేస్తుంది.చాలా మంది తాగాల్సిన సమయంలో కాకుండా అనవసరమైన సమయంలో నీళ్లు తాగుతుంటారు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా నీరు తాగండి. దీని వల్ల వీరు అధిక బరువు నుండి తప్పించుకుంటారు. అంతేకాదు స్లిమ్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.పాల ఉత్పత్తులకు సంబంధించిన పదార్థాలు తిన్న వారు కూడా సులభంగా బరువు తగ్గారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.చాలా మంది ఉదయాన్నే వాకింగ్ లేదా జాగింగ్ కు వెళ్లినప్పుడు బాగా ఆకలి అవుతుంది. అప్పుడు వారు ఎలాంటి ఆహారం తీసుకోరు.


దీంతో వారు మరింత ఎక్కువగా తింటూ ఉంటారు. దీంతో వెయిట్ ఈజీగా పెరిగిపోతారు. అలా కాకుండా మీ వద్ద ఏదైనా చిరుతిళ్లను ఉంచుకోండి. మీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వాటిని తినండి. దీని వల్ల వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది.సైకిల్ తొక్కడాన్ని మరోసారి ప్రారంభించండి. దీని వల్ల మీ బాడీలో క్యాలరీలు కరగడంతో పాటు ఎంతో ఉత్సాహం, ఆనందం కూడా మీ సొంతం అవుతుంది.టెన్నిస్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ ఇలా ఏదో ఒక ఆటను మీ స్నేహితులతో కలిసి ఆడండి. దీని వల్ల మీ క్యాలరీలు సులభంగా తగ్గుతాయి.ప్రతిరోజూ ఉదయం స్పోర్ట్స్ షూస్ వేసుకుని, మంచి మ్యూజిక్ వింటూ కొంత దూరం పరిగెడితే చాలు.. మీ వెయిట్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. అయితే కనీసం ఇరవై నిమిషాల పాటు రన్నింగ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.మెట్లను రెగ్యులర్ గా వాడండి. దీని వల్ల మీ బాడీలో చాలా క్యాలరీలు ఖర్చవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: