బ్లూ బెర్రీస్ ఈ సంవత్సరం పొడవునా దొరుకుతాయి. బ్లూ బెర్రీస్  ఇప్పుడు వాణిజ్య పంటగా కూడా మారింది. ఈ చెట్టు పొదలా పెరుగుతుంది. బ్లూ బెర్రీ ముదురు నీలి రంగులో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో చాలా రకాల పోషకాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. బ్లూ బెర్రీలు తినడంవల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

 బ్లూ బెర్రీస్ తినడం వల్ల శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పని చేయడానికి సహాయపడతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు బ్లూ  బెర్రీస్ లో ఉంటాయి.  అందుకే బ్లూ బెర్రీస్ తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ముసలి వాళ్ళ లో కూడా జ్ఞాపక శక్తి బాగా  పెరుగుతుందని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అందుకే బ్లూ బెర్రీస్ ను  రోజు తినడం మంచిది.

 బ్లూ బెర్రీస్ తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని తెలుసు. అది ఎలా అంటే బ్లూ బెర్రీస్ లో ' ఆక్సిడేటివ్ ఫైటో కెమికల్స్' ఉండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ లో చిత్రమైన ఒక వ్యాసంలో శాస్త్రజ్ఞులు  తెలియజేశారు.

 వయోజనుల జ్ఞాపక శక్తి పెరగడానికి బ్లూ బెర్రీస్  ఎంతగానో తోడ్పడతాయని అధ్యయన కర్త రాబర్ట్ క్రికొరియన్ తెలియజేస్తున్నారు. అలాగే 70 సంవత్సరాల వయసుపైబడిన వృద్ధుల మీద బ్లూ బెర్రీస్ జ్యూస్ బాగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. రోజు రెండు కప్పుల జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరిగినట్లు తేలింది.

 ఈ ప్రయోగంలో బ్లూ బెర్రీస్ బాగా పనిచేయడంతో ' న్యూరో డిజినరేషన్ నిరోధించడానికి బ్లూ బెర్రీస్ ఎంతో సహాయపడతాయని తెలుసుకున్నారు రాబర్ట్ క్రికొరియన్. బ్లూ బెర్రీస్ లో బీటా కెరోటిన్, లూటిన్, అనే కెరోటినాయిడ్స్, ఆంథో సియానిన్ అనే ఫ్లేవనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలిఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మరియు పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: