ఇంటర్నెట్ డెస్క్: చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని దాదాపు ప్రతి డాక్టర్ చెప్తారు. అయితే ఆ చేపలను ఆరోగ్యకరమైన మేత వేసి పెంచాలి. అలా కాని పక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవు. కుళ్లిన కోళ్ల మాంసం, పశు వ్యర్థాలు తిని పెరిగిన చేపలు విషతుల్యమే. ఇవి తింటే ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. కానీ సంపాదనే పరమావధిగా చేపలు పెంచుతున్నవారికి ఇవేవి పట్టవు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు…విష పూరితంగా మారిన చేపలను విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు..
       
 ఈ తరహాలోనే తెలంగాణలోని కొందరు దురాశపరులు చేపలను విక్రయిస్తున్నారు. ఇది మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపెల్లి గ్రామ సమీపాన చికెన్ లో వుండే వ్యర్థ పదార్థాలను సేకరించి పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు. కుళ్లిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దాణాగా అందిస్తున్నారు. పక్కనే గోదావరి ఉండడంతో వీటిని ‘గంగ చేపలుగా చెప్పి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
నిజానికి చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు అంటుంటారు. కానీ ఈ చేపలను తింటే మాత్రం ఆసుపత్రి పాలవ్వడం ఖాయమంటున్నారు.
      
చికెన్ వేస్టేజ్ తో పెంచిన ఈ చేపలను ససేమిరా తినొద్దని హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా భీమరాం పరిసర ప్రాంతాల్లో ఈ చేపల పెంపకం కొన్నేళ్లుగా జరుగుతోంది. ఆంధ్రాకు చెందిన కొంతమంది ఇక్కడి రైతుల దగ్గర వ్యవసాయ భూములను లీజుకు తీసుకుని చేపల చెరువులు చేశారు. ఇక్కడ జెల్ల రకానికి చెందిన చేపలను ఎక్కువగా పెంచుతున్నారు. సాధారణంగా చేపలు ఆరోగ్యకరంగా పెరిగేందుకు జొన్న మొక్కజొన్నతో పాటు పలు రకాలపిండిని మేతగా వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయాలనే అత్యాశతో చికెన్ వేస్టేజ్ వేసి చేపలను పెంచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: