
మన శరీరంలో ప్రతి అవయమం చాలా ముఖ్యమైనది. ఏ ఒక్క భాగం సరిగా పని చేయకపోయినా మనలో ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం. అందుచేతనే మన శరీర భాగాలన్నింటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ముఖ్యంగా మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన బాడీలో ఉండే మలినాలను క్లీన్ చేస్తూ, తిన్న ఆహారం ద్వారా కావలసిన విటమిన్లు, పోషకాలను తీసుకుని వ్యర్థాలను ఫిల్టర్ చేసి మలవిసర్జన రూపంలో బయటకు పంపిస్తాయి. ఫలితంగా మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో మేలు చేస్తుంటాయి.
ఇంతటి మంచి పని చేసే మూత్రపిండాలు ఏవో కారణాల చేత సరిగా పని చేయకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ మూత్రపిండాలు బాగా పని చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ కిడ్నీలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే మాత్రం.. మన శరీరంలో మలినాలు పేరుకుపోవడం,అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ . ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకుగాను కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇక ఆహార విషయంలో ఆక్సలైట్ వున్న ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆక్సలైట్ కలిగి ఉన్న బీట్రూట్, ఆకుకూరల్లో ఒకటి అయినటువంటి బచ్చలికూర, చాక్లెట్ వంటి పదార్థాలను తినకూడదు. అంతేకాకుండా మాంసాహారం కూడా తీసుకోకూడదు. దీంతోపాటుగా పాలకు కూడా చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా చల్లటి నీటిని ఫ్రిజ్లో పెట్టుకొని తాగకూడదు. మరియు చల్లటి పానీయాలకు కూడా దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అంతే కాకుండా రోజుకు ఎనిమిది నుండి తొమ్మిది లీటర్ల నీటిని తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రపిండాలను శుభ్రం చేసుకునే లాగా ఉండాలి. అప్పుడే మన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడంతోపాటు మన శరీరంలోని పనులను సవ్యంగా జరపడానికి సహాయపడతాయి..