సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో దొరికే పండు అరటి పండు.  తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. కేవలం అరటి పండు మాత్రమే కాకుండా అరటి తొక్క కూడా ముఖ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా అరటి మొగ్గ తో కూడా వివిధ రకాల వంటకాలు చేసుకొని తింటుంటారు. అలాగే అరిటాకులో వడ్డించిన భోజనం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎందుకంటే తాజా అరిటాకులో మైనపు పూత కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వేడి ఆహారం తాజా ఆకులపై తగులుతుందో, ఆ వేడికి మైనపు పూత కరిగి, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే ముఖ్యంగా అరటి పళ్ళలో ఏ అరటి పండ్లు మనకు ఇంకా ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..



పూర్వం నుంచి అందరికీ తెలిసిన  అరటి పండ్లలో రకాలు కర్పూరం, అమృతపాణి. అయితే ఈ రెండు రకాలు అరుదుగా దొరికే పండ్లు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరికే ఈ పండ్లలో  ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా చేకూరుస్తాయి. అంతేకాకుండా వీటిలో చక్కెరకేళి పండ్లు కూడా ఉంటాయి. అప్పట్లో అరటిపండులో రారాజు అంటే చక్కరకేళి అని చెప్పే వాళ్ళు. అయితే ఈ అరటి పండ్లు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా,గుంటూరు జిల్లాలలో మాత్రమే లభిస్తాయి. మామూలు అరటి పళ్ళ తో పోలిస్తే వీటి ధర కూడా కొంచెం ఎక్కువే. కార్బైడ్ వేసి బాగా పండించిన పండ్ల కంటే, స్వతహాగా మాగిన పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి.


అరటి పండ్ల లో అ రకం పండు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. మన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. అరటి పండ్లు తినడం వల్ల ముఖ్యంగా రోజుకు రెండు నుండి మూడు అరటి పండ్లు తినడం వల్ల నిత్యం  ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు. అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం అరటి పండ్లను తినకూడదు. ఎందుకంటే అరటి పండ్లలో ఉండే చక్కెర స్థాయి, రక్తంలోని చక్కెర స్థాయిలను పెంపొందిస్తాయి. అయితే అరటిపండు తినాలని అనిపించినప్పుడు యాలక్కి రకం అరటిపండు తినడం మంచిది.అధిక బరువును నియంత్రించుకోవడానికి,  గుండె జబ్బులు దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: