సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక కుతూహలం అనేది ఉంటుంది. అది ఎందులోనైనా సరే.. కొంత మందికి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని ఉంటే, మరికొంత మందికి వారి స్వభావం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది.. అలాగే మరికొంత మందికి వారి గురించి, వారి పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలి అని కూడా ఉంటుంది. అయితే మీ బ్లడ్ గ్రూపు ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని మీరు కూడా కుతూహలంగా ఎదురుచూస్తున్నారా..? అయితే పదండి.. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ బ్లడ్ గ్రూప్ ఏది.. దానిని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకుందాం..


సాధారణంగా కొన్ని దేశాలలో పుట్టిన నక్షత్రం, తిథి, రాశులను బట్టి వారు ఎలాంటి వారో పరిగణిస్తారు. మరికొన్ని దేశాలలో వారి నడక, మనిషి ప్రవర్తన తీరు, నడత , ఇతరులతో మాట్లాడే విధానం వీటన్నింటిని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెబుతారు. అయితే ఈ మధ్యకాలంలో బ్లడ్ గ్రూప్ ను బట్టి కూడా వ్యక్తులు ఎలాంటి వారో చెబుతున్నారు. రక్తంలో ప్రధానంగా ఉండే గ్రూపులు నాలుగు మాత్రమే. అవి  A, B, AB, O.
 కానీ మన ప్రపంచంలో జనాభా వందల కోట్లు ఉంది. ఇక అందరినీ ఈ నాలుగు గ్రూపులకు మాత్రమే పరిమితం చేయడం కరెక్టేనా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. అందుకే ఇలాంటి అంచనాలను వ్యతిరేకిస్తూ మరికొంతమంది వారి గ్రూపు ఎలాంటిదో,వారి స్వభావం ఏమిటో తెలియజేస్తున్నారు..


మరీ ముఖ్యంగా జపాన్ దేశస్తులు ఈ బ్లడ్ గ్రూప్ ఆధారంగా మనుషుల వ్యక్తిత్వం ఏమిటో, వారు బాగా నమ్ముతారు.. జపాన్ దేశంలో ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నవారు ఉన్నారు. ఇక తర్వాత బీ బ్లడ్ గ్రూప్ వాళ్ళు వున్నారు. అయితే ఎవరు ఎలాంటి వారు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ బ్లడ్ గ్రూప్ :
ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు చాలా తెలివైన వారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. వీరు సెన్సిటివ్ మనస్తత్వం కలిగినవారు. అంతేకాకుండా వీరికి సహనం కూడా ఎక్కువే. ఇతరులకు సహాయం చేస్తూ చాలా నమ్మకంగా ఉంటారు. శాంతిని కోరుకుంటారు. వీరు ఒక్కొక్కసారి అతి సున్నితత్వాన్ని కోరుకుంటారు. అంటే వీరితో పాటు సమాజం కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచన వీరిలో ఎప్పుడూ ఉంటుంది.. అంతేకాకుండా వీళ్ళకు రూల్స్ ని బ్రేక్ చేయడం ఇష్టం ఉండదు.చేసే ఏ పనినైనా కచ్చితంగా ఫాలో అయ్యే గుణం వీరిలో ఉంటుంది. ఏదైనా ఒక విషయానికొస్తే నిర్ణయం తీసుకోవడంలో చాలా నెమ్మదస్తులు. ప్రతిదీ శుభ్రంగా, ఎక్కడ ఉండే వస్తువు అక్కడే ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.. వీళ్లు గొడవలకు, యుద్ధాలకు వెళ్లరు.  ఏం జరిగినా శాంతంగా సమస్య ను పరిష్కరించుకోవాలని ఎదురుచూస్తూ ఉంటారు..


బీ బ్లడ్ గ్రూప్ :
బీ బ్లడ్ గ్రూపు వున్న వారు తమ క్రియేటివిటీతో ఫేమస్ అవుతారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తులు.. ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకునే విషయంలో మాత్రం అంత సమర్థంగా పనిచెయ్యలేరు. దేనిపైనైనా శ్రద్ధ పెట్టారంటే... పూర్తిగా దానిపై ఏకాగ్రత చూపించగలరు. ఓ లక్ష్యం పెట్టుకున్నాక అది నెరవేరకపోయినా దాన్ని వదలరు. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూనే ఉంటారు. మనసులో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. లోతుగా, వేగంగా ఆలోచిస్తారు. ఇతరుల మైండ్ సెట్‌ని ఈజీగా అర్థం చేసుకోగలరు. వీళ్లకు సవాళ్లు నచ్చవు. ఇతరులతో పోటీలు, వివాదాలు నచ్చవు.


ఏబీ బ్లడ్ గ్రూప్  :
ఏ, బీ గ్రూపుల లక్షణాలు AB గ్రూపు వారిలో ఉంటాయి. ఇతరులకు వీళ్లు అర్థం కారు. డబుల్ సైడ్ ఉంటున్నట్లు ఇతరులు వీళ్లను ఫీలవుతారు. వీళ్లు ఒక్కోసారి B లాగా చాలా ధైర్యంగా ఉంటారు, ఒక్కోసారి A లాగా బాగా మొహమాట పడతారు. చెప్పాలంటే... ఒకే వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులు (స్ప్లిట్ పర్సనాల్టీ) ఉన్నారా అనిపించేలా ఉంటారు. అపరిచితుల ముందు ఈ బ్లడ్ గ్రూపు వారు వాస్తవంగా ఉంటారు. ఐతే... వీళ్లు ఎలాంటి వారో కొత్త వారికి అంత ఈజీగా అర్థం కాదు. ఈ గ్రూపు వారి లాగే, ఈ బ్లడ్ గ్రూప్ కూడా ప్రపంచంలో తక్కువగానే ఉంటోంది. AB గ్రూపు వారు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. ఇతరులతో డీలింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇతరుల కోణం నుంచి కూడా విషయాన్ని ఆలోచించగలరు.


ఓ బ్లడ్ గ్రూప్ :
ఓ గ్రూపు వ్యక్తులు ఒకే చోట ఉండలేక పక్షుల్లాగా విహరించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువ. తమను తాము ఉన్నత స్థానాల్లో ఉండేలా చూసుకుంటారు. ఏం చెయ్యాలనుకుంటారో అది చేసి తీరతారు. వీళ్లలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాల్ని వీళ్లు లైట్ తీసుకుంటారు. ఐతే... వీళ్లకు A గ్రూప్ వాళ్లు తగిలితే... ఆ A గ్రూపు వాళ్లు వీళ్లను చూసి... స్వార్థపరులు అనుకుంటారు. ఎందుకంటే... A గ్రూపు వాళ్లు చిన్న విషయాలపై కూడా ఎంతో శ్రద్ధ పెడతారు. O గ్రూపు వాళ్లు ఉదారంగా ఉంటారు. దయాగుణం, జాలి గుణం ఎక్కువ. వీళ్లను ఎక్కువ మంది ఇష్టపడతారు. O గ్రూపు వాళ్లు మార్పుల్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: