ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది కొవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి చాలా భయపడుతున్నారు . ఇందుకు కారణం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడడం, అంతేకాకుండా పైగా రిజల్ట్ కచ్చితంగా వస్తుందా లేదా అనే దాని వల్ల కూడా చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. సాధారణంగా ఆర్టీ - పీసీఆర్ పరీక్ష చేస్తే మూడు ,నాలుగు రోజుల సమయం పడుతుంది.. అయితే ఇప్పుడు ఆ రోజులు పోయాయి.. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం రెండంటే రెండే నిమిషాల్లో నే టెస్ట్ అలాగే ఫలితాలు కూడా రాబోతున్నాయి..అయితే దాని వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

కేవలం రెండు నిమిషాల్లోనే కరోనాను గుర్తించే పరికరాన్ని , చెన్నై కీజ పక్కం లోని కేజీ ఆసుపత్రి పీజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తయారుచేశారు. కేజే కోవిడ్  ట్రాకర్ పేరుతో డిజైన్ చేసిన ఈ పరికరం తయారీకి నానో సాంకేతికను వినియోగించారు. ఇక ఈ పరికరం చెయ్యి ఆకారంలో ఉంటుంది. ఇక  ఈ పరికరంలో ఒక సెన్సార్ ను అమర్చారు . దీనిని లాప్ టాప్ కు  అనుసంధానించి  ఉపయోగించవచ్చు.

అయితే ఎలాంటి శాంపిల్స్ అవసరం లేకుండానే,  ఈ పరీక్షను నిర్వహిస్తారు. అయితే ఎవరైతే కరోనా పరీక్షలు చేయించుకుంటారో ఆ వ్యక్తి యొక్క ఐదు చేతివేళ్లను ఈ పరికరంలోని ట్రాకర్ పై ఉంచాలి . రెండు నిమిషాల్లోనే ఆ వ్యక్తి రక్తపోటు, ఆక్సిజన్ స్థాయి ,శరీర ఉష్ణోగ్రత ,రక్త కణాల సంఖ్య అన్ని ఇలాగే తెలిసిపోతాయి. జీటా పొటెన్షియల్ స్థాయిలు దీని ద్వారా పసిగట్టవచ్చు. ఇక వీటి ఆధారంగా పరీక్ష చేయించుకున్న వ్యక్తికి కరోనా సోకిందా  లేదా అన్న విషయాన్ని , కేవలం రెండు నిమిషాల్లోనే ఈ మెషిన్ ద్వారా తెలుసుకోవచ్చు అని అంటున్నారు. ఈ పరికరాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోనీ రోగులపై ప్రయోగించినట్లు , కేజీ ఆసుపత్రి పీజీ రీసెర్చ్ సెంటర్ ఎడ్యుకేషన్ హెడ్ కేశవన్  జగదీష్ తెలిపారు..


ఇక ఈ పరికరం ఖచ్చితమైన రిజల్ట్ ఇచ్చిందని, ఆర్టీ పీ సీ ఆర్ తో పోలిస్తే మరింత కచ్చితత్వంతో,  వేగంగా ఫలితాలను సాధించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని , పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ బాగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరికరాలు  బాగా ఉపయోగపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: